Article Fast Food %e0%b0%aa%e0%b0%a8%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d %e0%b0%ab%e0%b1%8d%e0%b0%b0%e0%b1%88%e0%b0%a1%e0%b1%8d %e0%b0%9a%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d 109031700081_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పనీర్ ఫ్రైడ్ చిప్స్

Advertiesment
వంటకాలు ఫాస్ట్ఫుడ్ చిప్స్ ఆలూ అరటి వెరైటీ పనీర్ ఫ్రైడ్ చిప్స్ నూనె కరివేపాకు కారంపొడి ఉప్పు అంగుళం బాణలి
సాధారణంగా చిప్స్ అంటే వెంటనే గుర్తుకొచ్చేవి ఆలూ, అరటి చిప్స్‌లే.. కానీ చిప్స్‌లో కూడా చాలా రకాల వెరైటీలు ఉన్నాయి. అలాంటివాటిలో ఒకటి పనీర్ ఫ్రైడ్ చిప్స్... ఇవి ఎలా చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు :
పనీర్... పావు కేజీ
నూనె.. వేయించేందుకు సరిపడా
కరివేపాకు పొడి... ఒక టీస్పూన్
కారంపొడి... ఒక టీస్పూన్
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
పనీర్‌ను ఒక అంగుళం సైజులో నిలువుగా ముక్కలుగా కోసుకోవాలి. వీటిని తిరిగీ అడ్డంగా పలుచటి ముక్కలుగా కత్తిరించుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి, కాగిన తరువాత పనీర్ ముక్కలను కొద్ది కొద్దిగా వేసి సన్నటి సెగమీద దోరగా వేయించి తీసేయాలి.

వేయించుకున్న పనీర్ ముక్కలను సర్వింగ్ డిష్‌లోకి మార్చి... కరివేపాకు పొడి, కారంపొడి, ఉప్పులను పైన చల్లి... వాటికి బాగా పట్టేలా కలియబెట్టాలి. అంతే పనీర్ ఫ్రైడ్ చిప్స్ రెడీ అయినట్లే...! ఈ చిప్స్‌ను వేడి వేడిగా తినేందుకు పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడవచ్చు. తయారు చేయడమూ ఈజీయే కాబట్టి, మీరూ ఓసారి ట్రై చేయండి మరి..!

Share this Story:

Follow Webdunia telugu