Article Fast Food %e0%b0%a6%e0%b0%82%e0%b0%aa%e0%b1%81%e0%b0%a1%e0%b1%81 %e0%b0%ac%e0%b0%bf%e0%b0%af%e0%b1%8d%e0%b0%af%e0%b0%82 %e0%b0%a6%e0%b1%8b%e0%b0%b8%e0%b1%86 109060600112_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దంపుడు బియ్యం దోసె

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
బియ్యం... 600 గ్రా.
దంపుడుబియ్యం... 400గ్రా.
మజ్జిగ... 200 మి.లీ.
కొబ్బరి... ఒకటి
బెల్లం.. పెద్ద ముక్క
మెంతులు... ఒక టీ.
ఉప్పు... సరిపడా
పచ్చిమిరపకాయలు... ఎనిమిది
నూనె ... తగినంత

తయారీ విధానం :
ముందుగా బియ్యం కడిగి ఆరుగంటలసేపు నానబెట్టాలి. దంపుడుబియ్యాన్ని కూడా కడిగి పది నిమిషాలు నానబెట్టాలి. కొబ్బరిని తురమాలి. మెంతులు కొద్దిగా వేయించి పొడి కొట్టాలి. ఇప్పుడు బియ్యం, దంపుడుబియ్యం, మజ్జిగ, కొబ్బరి తురుము, బెల్లం, ఉప్పు అన్నీ కలిపి దోసెల పిండి మాదిరిగానే మెత్తగా రుబ్బుకోవాలి.

ఈ పిండిని సుమారు ఎనిమిది గంటలసేపు నానబెట్టాలి. తరవాత పచ్చిమిర్చిని ముక్కలుగా కోసి పిండిలో వేయాలి. స్టవ్‌మీద దోసెల పెనం పెట్టి కొద్దిగా నూనె వేయాలి. గుంట గరిటెతో పిండి తీసుకుని దోసెలా వేసి, మూత పెట్టి చిన్న మంట మీదుంచాలి. దోసె బాగా కాలి గోధుమరంగులోకి మారిన తరవాత అట్లకాడతో తీసి దాని మీద వెన్న రాసి వడ్డించాలి.

Share this Story:

Follow Webdunia telugu