Article Fast Food %e0%b0%9f%e0%b0%ae%e0%b1%8b%e0%b0%9f%e0%b1%8b %e0%b0%95%e0%b1%86%e0%b0%9a%e0%b0%aa%e0%b1%8d %e0%b0%b0%e0%b1%88%e0%b0%b8%e0%b1%8d 108091300066_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టమోటో కెచప్ రైస్

Advertiesment
వంటకాలు ఫాస్ట్ ఫుడ్ టమోటో కెచప్ రైస్ సన్నని బియ్యం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కారం నెయ్యి గరంమసాలా జీలకర్ర ఉప్పు టమోటో కెచప్ రైస్
FileFILE
కావలసిన పదార్దాలు :
సన్నని బియ్యం... ఒక కప్పు
టమోటోలు... అరకేజీ
పచ్చిమిర్చి.. రెండు
ఉల్లిపాయలు... ఒక కప్పు
కారం... అర టీస్పూన్
నెయ్యి... మూడు టీస్పూన్లు
గరంమసాలా... సరిపడా
జీలకర్ర... సరిపడా
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గంటసేపు నాన బెట్టాలి. తరువాత టమోటోలను వేడి నీటిలో మరిగించి చల్లార్చాలి. టమోటోలు చల్లారిన తరువాత తోలు తీసి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఆతరువాత ఉల్లిపాయలను సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బాణలిలో నెయ్యి వేసి కాగిన తర్వాత ఉల్లిముక్కలు వేసి వేయించాలి. వీటిలో నుండి సగం వేగిన ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఆతరువాత బాణలిలో టమోటో ముక్కలు, కారం, గరంమసాలా, జీలకర్ర వేసి కొంచెం సేపు వేయించాలి.

దాంట్లోనే నానబెట్టిన బియ్యాన్ని వేసి మరి కొంచెం సేపు వేయించి, సరిపడా నీటిని పోసి అత్తెసరు పెట్టాలి. బియ్యం ఉడికిన తర్వాత దించి పక్కన పెట్టుకున్న ఉల్లి ముక్కలు పైన చల్లాలి. అంతే రుచికరమైన టమోటో కెచప్ సిద్ధమైనట్లే..!

Share this Story:

Follow Webdunia telugu