కావలసిన పదార్థాలు : పుల్లటి మజ్జిగ... రెండు కప్పులు మైదా... ఒకటిన్నర కప్పు బియ్యంపిండి... ఒకటిన్నర కప్పు ఉప్పు.. తగినంత బజ్జీ మిరపకాయలు... ఎనిమిది జీలకర్ర... కాస్తంత వంటసోడా... చిటికెడు నూనె... రెండు కప్పులు
తయారీ విధానం : మజ్జిగలో మైదా, బియ్యప్పిండి, వంటసోడాలు కలిపి పకోడీల పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిని కనీసం నాలుగు గంటలుపాటు నానబెట్టి.. అందులో పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, ఉప్పులను కాస్త దంచి కలపాలి. తరువాత బాణలిలో నూనె పోసి బాగా మరుగుతుండగా కలుపుకున్న పకోడీల పిండిని చిన్న చిన్న పకోడీల్లాగా వేయాలి.
ఇవి బాగా పొంగుతాయి కాబట్టి చిన్న చిన్నవిగా వేసుకోవటం మంచిది. కాస్త దోరగా వేగిన తరువాత తీసి వేడి వేడిగా, కారం చట్నీతో కలిపి తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరూ ట్రై చేసి చూడండి మరి...!!