Publish Date: Tue, 22 Jul 2008 (12:00 IST)
Updated Date: Tue, 22 Jul 2008 (11:59 IST)
కావలసిన పదార్థాలు :
పాలు... రెండు కప్పులు
కోడిమాంసం... అరకిలో (మెత్తనిది)
కొత్తిమీర తరుగు... నాలుగు టీ స్పూన్లు
ఉప్పు... సరిపడా
కార్నఫ్లోర్... ఆరు స్పూన్లు
జాజికాయ పొడి, మిరియాల పొడి... తగినంత
నూనె... పావు కేజీ
కోడి గుడ్డు సొన... నాలుగు గుడ్లది
వెన్న... 100 గ్రాములు
రొట్టెముక్కలు... రెండు కప్పులు
తయారీ విధానం :
వెన్నను వేడి చేసి కరిగాక, కోడిమాంసం ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించాలి. తరువాత పాలు పోసి మరుగుతుండగా... అందులో కొత్తిమీర, ఉప్పు, జాజికాయ పొడులను చేర్చాలి. తరువాత దీనిని పొంగు వచ్చేదాకా ఉడికించి దించి పక్కన పెట్టుకోవాలి.
చల్లారిన తరువాత ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని గుండ్రంగా లేదా మనకు నచ్చిన ఆకారంలో కట్‌లెట్స్‌గా చేసుకోవాలి. ఆపై వాటిని కార్న్‌ఫోర్ల్‌లో అటు ఇటు దొర్లించి, కోడి గుడ్డులోని తెల్లని సొనను గిలకొట్టి అందులో కట్‌లెట్‌లను ఒక్కొక్కటిగా ముంచి తీశాక రొట్టె ముక్కల పొడిలో అద్ది ప్లేట్‌లో అరగంటపాటు ఉంచాలి.
అరగంట తర్వాత నూనెను బాగా వేడిచేసి అందులో కట్‌లెట్ ముక్కలను వేసి, బాగా కాలిన తరువాత నూనె నుండి వేరు చేసుకోవాలి. ఇలా తయారైన కట్‌లెట్ ముక్కలను టమోటా సాస్, గ్రీన్ చట్నీతో కలిపి సర్వ్‌చేయాలి.