Publish Date: Fri, 09 Jan 2009 (11:04 IST)
Updated Date: Fri, 09 Jan 2009 (11:03 IST)
కావలసిన పదార్థాలు :
క్యాబేజీ తురుము... పెద్ద కప్పు
నూనె... నాలుగు టీస్పూన్లు
కారం... ఒక టీస్పూను
ఉప్పు... ఒక టీ స్పూను
ఆవపిండి... పావు టీ స్పూను
మెంతిపిండి... పావు టీస్పూను
ఇంగువ... చిటికెడు
పసుపు... చిటికెడు
తయారీ విధానం :
ఓ పొడి పాత్ర తీసుకుని అందులో క్యాబేజీ తురుము వేయాలి. అందులోనే ఉప్పు, కారంతో పాటు పైన చెప్పుకున్న పొడులన్నీ వేసి బాగా కలిపి, నూనె పోసి జాడీలో పెట్టాలి. 24 గంటల తరవాత మూత తీసి మరోసారి కలిపితే క్యాబేజీ ఊరగాయ రెడీ అయినట్లే...! ఇది సుమారు నెల రోజూలపాటు నిల్వ ఉంటుంది. (ఇదే పద్ధతిలో పచ్చి బొప్పాయి, దోసకాయలతో కూడా నోరూరించే ఊరగాయల్ని చేసుకోవచ్చు. ఇవి కూడా సుమారు వారం రోజుల వరకూ నిల్వ ఉంటాయి.