కావలసిన పదార్థాలు : పచ్చి బియ్యం... ఒక కప్పు ఉప్పుడు బియ్యం... ఒక కప్పు కొబ్బరి తురుము... అర కప్పు మినప్పప్పు... ఒక టీ. ఉప్పు... తగినంత నూనె... సరిపడా
తయారీ విధానం : పచ్చిబియ్యం, ఉప్పుడు బియ్యం, మినప్పప్పులను కలిపి నానబెట్టాలి. రుబ్బేటప్పుడు కొబ్బరితురుము, ఉప్పును కూడా చేర్చి రుబ్బుకోవాలి. రుబ్బిన తరువాత ఆ పిండిని మూడు గంటలపాటు అలాగే ఉంచి, పిండి పులిసిన తరువాత బాగా దోశెల పిండిలాగా కలుపుకోవాలి.
నాన్‌స్టిక్ పెనం వేడయ్యాక ఈ పిండిని దోశెల్లాగా పోసి తగినంత నూనె వేసి రెండువైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే కొబ్బరి దోశెలు రెడీ..! వీటిని ఏదేని గ్రీన్ చట్నీతో లేదా కారం పచ్చడితో కలిపి వేడి వేడిగా తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటాయి.