Article Fast Food %e0%b0%95%e0%b1%82%e0%b0%b0%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8b %e0%b0%b8%e0%b1%8b%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d 108031000024_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కూరలతో సోమాల్

Advertiesment
మైదాకప్పు కార్న్ ఫ్లోర్  ఒక టేబుల్ స్పూన్
కావలసిన పదార్థాలు :
మైదా - కప్పు, కార్న్ ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్, రవ్వ - పావు కప్పు (వేయించినది), ఉప్పు - తగినంత, బటర్ - ఒక టేబుల్ స్పూన్.

ఫిల్లింగ్ కోసం - క్యారెట్ - అర కప్పు, క్యాబేజ్ - పావు కప్, బీన్స్ - పావు కప్పు, పీస్ - పావు కప్పు, ఉల్లిపాయలు - రెండు, టమోటా - అర కప్పు, పచ్చిమిర్చి - ఒకటి, పసుపు - చిటికెడు, అల్లం - వెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్, కొత్తిమీర ఆకులు - అర కప్పు, గరం మసాలా పొడి - అర టీస్పూన్.

తయారు చేయు విధానం :
ముందుగా బాణాలిలో కాస్త నూనె వేసి అందులో అరకప్పు తరిగిన ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. వీటిని దించిన తర్వాత ఇందులో అన్ని రకాల కూరలు, టమోటాలను వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్‌లను వేసి ఉప్పు కూడా వేసి వేయించాలి. తర్వాత ఇందులో గరం మసాలా పొడి, వేయించిన ఉల్లిముక్కలు, కొత్తిమీరలను వేసి తిప్పి దించాలి.

మైదా పిండిలో నీళ్లు పోసి కలిపి గంట సేపు ఉంచాలి. తర్వాత దీనిని పూరీ ఉండలుగా చిన్నగా చేసుకోవాలి. సోమాస్ చేసే అచ్చులో దీనిని పెట్టి కూరల మిశ్రమాన్ని ఓ స్పూన్ తీసుకుని ఇందులో వేసి బయటకు రాకుండా మూయాలి. దీనిని నూనెలో వేసి వేయించాలి. ఓ వారం వరకు ఫ్రిజ్‌లో ఉంచి వాడుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu