Article Fast Food %e0%b0%95%e0%b1%82%e0%b0%b0%e0%b0%97%e0%b0%be%e0%b0%af%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8b %e0%b0%ac%e0%b1%8b%e0%b0%82%e0%b0%a1%e0%b0%be 108100600064_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కూరగాయలతో బోండా

Advertiesment
వంటకాలు ఫాస్ట్ ఫుడ్ క్యారెట్ బీన్స్ క్యాబేజీ పచ్చి బఠానీ కాలీఫ్లవర్ మినప్పప్పు కొత్తిమీర తురుము వంటసోడా నూనె కరివేపాకు
WD PhotoWD
కావలసిన పదార్థాలు :
బంగాళా దుంపలు... 200 గ్రాములు
క్యారట్, బీన్స్... వంద గ్రాములు
క్యాబేజీ, పచ్చి బఠానీలు... వంద గ్రాములు
కాలీఫ్లవర్... వంద గ్రాములు
మినపప్పు... వంద గ్రాములు
కొత్తిమీర తురుము... కాస్తంత
వంటసోడా... సరిపడా
నూనె... తగినంత
కరివేపాకు రెమ్మలు... కాసిన్ని

తయారీ విధానం :
పైన చెప్పుకున్న బంగాళాదుంపలు, క్యారట్, బీన్స్, క్యాబేజీ, పచ్చిబఠాణీలు, కాలీఫ్లవర్ లాంటి వాటినన్నింటినీ చిన్న ముక్కలుగా కోసుకుని, ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత రుబ్బి ఉంచుకున్న మినప్పప్పు ముద్దలో ఉడికించిన కూరగాయల ముక్కలు, కొత్తిమీర తురుము, సరిపడ ఉప్పు, కాస్తంత వంటసోడా వేసి బాగా కలుపుకోవాలి.

తరువాత స్టవ్‌పై బాణలి పెట్టి నూనెను పోసి బాగా కాగుతుండగా... మినప్పప్పు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని బోండాల్లాగా నూనెలో వేసి ఎర్రగా కాల్చాలి. అలా మొత్తం పిండినంతా అలాగే చేసుకోవాలి. తరువాత ఈ బోండాలను సర్వింగ్ డిష్‌లో వేసి చుట్టూ కరివేపాకు రెమ్మలతో అలంకరించి సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu