Publish Date: Tue, 24 Feb 2009 (15:37 IST)
Updated Date: Tue, 24 Feb 2009 (15:36 IST)
కావలసిన పదార్థాలు :
మొక్కజొన్న గింజలు... ఒక కప్పు
మీడియం సైజు టమోటోలు... మూడు
కీరదోసకాయ ముక్కలు... ఒక కప్పు
ఉల్లికాడల ముక్కలు... అర కప్పు
మీగడ తీసిన పెరుగు... మూడు టీస్పూన్లు
నిమ్మరసం... రెండు టీస్పూన్లు
వెల్లుల్లి ముక్కలు... ఒక టీస్పూన్
సన్నగా తరిగిన కొతిమీర ఆకులు.. రెండు టీస్పూన్లు
మిరియాల పొడి... కొద్దిగా
తయారీ విధానం :
మొక్కజొన్న గింజలను ఉడికించి నీరు వార్చేసి ఉంచుకోవాలి. ఒక బౌల్‌లో ఉడికించిన మొక్కజొన్న గింజలు, టొమోటో ముక్కలు, ఉల్లికాడల ముక్కలు, కీర దోసకాయ ముక్కలు వేసి కలిపాలి.
వేరొక గిన్నెలో పెరుగులో కొత్తిమీర, నిమ్మ రసం, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, మిరియాలపొడిలను వేసి బాగా బీట్ చేసి మొక్కజొన్న మిశ్రమం ఉన్న బౌల్‌లో పోసి కలియబెట్టాలి. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి, చల్లబడిన తరువాత తింటే బాగుంటుంది. చల్లదనం ఇష్టం లేని వారు ఫ్రిజ్‌లో పెట్టకుండా అలాగే తినవచ్చు. అంతే కార్న్.. టొమోటో సలాడ్ రెడీ అయినట్లే...!