కావలసిన పదార్థాలు :
పచ్చిమొక్కజొన్నగింజలు... రెండు కప్పులు
గోధుమపిండి... ఒక కప్పు
పసుపు... అర టీ.
ఉప్పు... తగినంత
కొత్తిమీర... రెండు కట్టలు
పచ్చిమిర్చి... మూడు
నెయ్యి... మూడు టీ.
వాము... ఒక టీ.
తయారీ విధానం :
పచ్చిమొక్కజొన్న గింజల్ని మెత్తగా రుబ్బాలి. అందులోనే గోధుమపిండి కూడా కలపాలి. అందులోనే ఉప్పు, పసుపు, వాము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి కలపాలి. తగినన్ని నీళ్లు చేర్చి చపాతీ ముద్దలా చేయాలి. ఇప్పుడు ఈ ముద్దను చిన్న చిన్న రొట్టెల్లా ఒత్తి వేడి పెనంమీద నెయ్యి వేస్తూ రెండు వైపులా ఎర్రగా కాల్చాలి. అంతే కార్నీ గీ రోటీ సిద్ధమైనట్లే..! వీటిని వేడిగా ఉన్నప్పుడే ఏదేని చట్నీ లేదా బఠానీ కుర్మాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.