Article Fast Food %e0%b0%8e%e0%b0%97%e0%b1%8d %e0%b0%aa%e0%b1%86%e0%b0%b8%e0%b0%b0%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81 108090600079_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎగ్ పెసరట్టు

Advertiesment
వంటకాలు ఫాస్ట్ఫుడ్ పెసరపప్పు కోడిగ్రుడ్లు రెండు గంటలు పచ్చిమిర్చి జీలకర్ర నెయ్యి ఉప్పు కరివేపాకు కోడిగ్రుడ్లు అల్లం ఎగ్ పెసరట్టు
FileFILE
కావలసిన పదార్ధాలు :
పెసరపప్పు.. ఒక కేజీ
పచ్చిమిర్చి... అర కేజీ
జీలకర్ర.. 50గ్రాములు
నెయ్యి... 200 గ్రాములు
ఉప్పు... సరిపడా
కరివేపాకు.. సరిపడా
కోడిగ్రుడ్లు.. ఎనిమిది
అల్లం.. వంద గ్రామలు

తయారీ విధానం :
రెండు గంటల ముందుగా పెసరపప్పును నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత గ్రైండర్‌లో వేసి మెత్తగా నూరుకోవాలి. ఇందులో కోడిగుడ్లు కొట్టి కలిపి వుంచుకోవాలి. దీనికి పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, అల్లం, ఉప్పు లాంటి వాటినన్నింటినీ కలిపి ముద్దగా నూరుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ముద్దను గ్రైండ్ చేసి ఉంచిన పెసర మిశ్రమంలో వేసి బాగా కలియబెట్టాలి.

ఇప్పుడు దోసెల పెనంను స్టవ్‌పై పెట్టి వేడిచేసి, కొద్దిగా నెయ్యి వేసి... పై మిశ్రమాన్ని అట్టులాగా పోయాలి. రెండువైపులా బంగారు వర్ణం వచ్చేదాకా నెయ్యి మరికొంత వేస్తూ బాగా కాల్చాలి. అంతే వేడి వేడి ఎగ్ పెసరట్టు రెడీ అయినట్లే...! వీటిని పల్లీల పచ్చడితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu