Publish Date: Sat, 02 Aug 2008 (15:44 IST)
Updated Date: Sat, 02 Aug 2008 (15:43 IST)
కావలసిన పదార్థాలు :
ఉల్లి ముక్కలు... రెండు కప్పులు
బియ్యంపిండి... అరకప్పు
ఉప్పు... సరిపడా
పచ్చిమిర్చి... ఒక టీ స్పూను తరిగినది
నూనె... వేపుడుకు సరిపడా
శనగపిండి... ఒకటిన్నరకప్పు
అల్లం, వెల్లుల్లి పేస్టు... అర టీస్పూను
కారం... అర టీస్పూను
కరివేపాకు... సరిపడా
తయారీ విధానం :
ఒక బౌల్‌లో ఉల్లిముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకులతో, శనగపిండిని కలిపి ముద్దగా చేసుకోవాలి. తరువాత కాగుతున్న నూనెలో పిండి ముద్దను కొద్దికొద్దిగా వేయాలి. గరిటతో కలుపుతూ ఎర్రగా వేయించి తీయాలి. తరువాత వేయించిన కరివేపాకుతో అలంకరించి అతిథులకు వడ్డించండి.