Article Fast Food %e0%b0%89%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf %e0%b0%ae%e0%b0%bf%e0%b0%a8%e0%b0%aa %e0%b0%a6%e0%b1%8b%e0%b0%b6%e0%b1%86 108101300075_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉల్లి మినప దోశె

Advertiesment
వంటకాలు ఫాస్ట్ఫుడ్ బియ్యం పిండి పచ్చిమిర్చి ముక్కలు నూనె దోశెలు రెడీ ఉల్లి బౌల్ పెనం వేడి తడిగుడ్డ మిశ్రమం అట్లకాడ
FileFILE
కావలసిన పదార్థాలు :
దోసెల పిండి (ముందుగానే రుబ్బి ఉంచుకున్నది)... పావు కేజీ
సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు... రెండు టీస్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు... పావు కప్పు
నూనె... దోసెలు కాల్చేందుకు సరిపడా

తయారీ విధానం :
ఒకరోజు ముందుగా మినప్పప్పు ఎక్కువగా వేసి... దోశెల పిండి తయారు చేసుకోవాలి. ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను ఒక బౌల్‌లోకి తీసుకుని రెండింటినీ కలిపి ఉంచుకోవాలి. దోశెల పెనం వేడిచేసి తడిగుడ్డతో తుడిచి, దాని మీద పెద్ద గరిటెతో ఓ గరిటెడు దోశెల పిండి పోసి దోసె వేసుకోవాలి. వెంటనే దానిపై ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల మిశ్రమాన్ని సమానంగా పరచాలి. ఆపై దోశెపై మూడు చెంచాల నూనెను పోయాలి.

దోశె ఎర్రగా కాలిన తరువాత మధ్యకు మడిచి వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఇష్టమైతే దోశెను రెండు వైపులా కూడా కాల్చుకోవచ్చు. వీటికి కొబ్బరి కుర్మాగానీ, టమోటా చట్నీగానీ, చికెన్ గ్రేవీని గానీ సై‌డ్‌డిష్‌గా వాడుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu