Article Fast Food %e0%b0%86%e0%b0%b2%e0%b1%82 %e0%b0%ac%e0%b1%8b%e0%b0%82%e0%b0%a1%e0%b0%be %e0%b0%ad%e0%b0%b2%e0%b1%87 %e0%b0%b0%e0%b1%81%e0%b0%9a%e0%b0%bf 109090500100_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఆలూ బోండా"... భలే రుచి..!

Advertiesment
వంటకాలు
FILE
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు.. అర కేజీ
నూనె.. తగినంత
నీళ్లు.. తగినన్ని
శెనగపిండి.. అర కేజీ
బియ్యంపిండి.. ఒక కప్పు
కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తరుగు.. కాస్తంత
అల్లంగుజ్జు.. 2 టీ.
పచ్చిమిర్చి.. 2 టీ.
నిమ్మరసం.. 2 టీ.
ఆవాలు.. ఒక టీ.
జీలకర్ర.. ఒక టీ.
పసుపు.. అర టీ.
ఉప్పు.. తగినంత
కేసరి కలర్.. పావు టీ.
వంటసోడా.. పావు టీ.

తయారీ విధానం :
బంగాళాదుంపల్ని ఉడికించి ఆరనివ్వాలి. ఆపై తొక్క తీసి దుంపలను బాగా చిదిమి ఉంచాలి. కడాయిలో నూనె పోసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తురుము వేసి దోరగా వేగనివ్వాలి. పసుపు వేసి వెంటనే అల్లం, పచ్చిమిర్చి గుజ్జు వేసి సువాసన వచ్చేవరకూ వేగనివ్వాలి. ఇప్పుడు చిదిమిన బంగాళాదుంపలు వేసి ఉప్పు చల్లి కలుపుతూ పొడిపొడిగా వేయించాలి.

తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కడాయి దించేసి, నిమ్మరసం పోసి కలపాలి. ఇప్పుడు శెనగపిండిలో బియ్యప్పిండి, కేసరి కలర్‌, వంటసోడా, తగినంత ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి గట్టి పెరుగులా పిండిని కలిపి ఉంచాలి. కూరను లడ్డూలంత సైజులో ముద్దలుగా చుట్టి పిండిలో ముంచి నూనెలో వేస్తూ దోరరంగులో వేయించి తీయాలి. వీటిని పచ్చిమిర్చి పచ్చడి లేదా టొమాటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu