Publish Date: Fri, 09 Jan 2009 (10:53 IST)
Updated Date: Fri, 09 Jan 2009 (10:52 IST)
కావలసిన పదార్థాలు :
చిన్న బంగాళా దుంపలు... పావు కేజీ
జీలకర్ర పౌడర్... ఒక టీస్పూన్
మామిడిపొడి... అర టీస్పూన్
సేమ్యా... 150 గ్రాములు
ఆయిల్... రెండు టీస్పూన్లు
ఎర్రకారం పొడి... అర టీస్పూన్
పెరుగు... ఒక కప్పు
ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
ఉప్పు వేసిన నీటిలో పొటాటోలను ఉడకబెట్టి కొద్దిగా మెత్తగా అయిన తరువాత కిందికి దించి, పై తోలు తీసి ఉంచుకోవాలి. పాన్‌లో నూనె వేసి వేడయిన తరువాత పొటాటో ముక్కలు, జీలకర్ర పౌడర్, మామిడి పొడి సేమ్యా, కారంపొడి, ఉప్పు తదితరాలను వేసి వేయించాలి.
కాసేపు అలాగే ఉడికిన తరువాత... కిందికి దించి దానిపై కొద్దిగా పెరుగు చల్లి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తరువాత ఒక్కొక్క దుంపను తీసుకుని ఫోర్క్‌తో గాట్లు పెట్టి, మిగిలిన పెరుగులో ముంచి, దానికి సేమ్యా బాగా చుట్టుకునేలా అద్దాలి. అంతే ఆలూ దహీ బాల్స్ సిద్ధమైనట్లే...!