Article Fast Food %e0%b0%86%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b0%a8%e0%b1%8d %e0%b0%8e%e0%b0%97%e0%b1%8d %e0%b0%aa%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9f%e0%b0%be 109021300070_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆనియన్ ఎగ్ పరోటా

Advertiesment
వంటకాలు ఫాస్ట్ఫుడ్ కోడిగ్రుడ్లు ఉల్లిపాయ తరుగు పరోటా జీలకర్ర మిరియాల పొడి ధనియాలు పసుపు నూనె కొత్తిమీర ఉప్పు
కావలసిన పదార్థాలు :
కోడిగ్రుడ్లు... మూడు
ఉల్లిపాయ తరుగు... ఒక కప్పు
పరోటాలు... రెండు
జీలకర్ర... కొద్దిగా
మిరియాల పొడి... అర టీ.
ధనియాల పొడి... అర టీ.
పసుపు... చిటికెడు
నూనె... వేపుడుకు తగినంత
కొత్తిమీర తురుము... అరకప్పు
టమోటా... ఒకటి
మిర్చి తరుగు... కొద్దిగా
ఉప్పు... సరిపడా

తయారీ విధానం :
బాణలిలో నూనెను పోసి వేడయ్యాక... జీలకర్ర, ఉల్లిపాయలు, టమోటాలు వరుసగా వేసి వేయించాలి. ఇందులో ముక్కలుగా చేసుకున్న పరోటాలను కొద్ది కొద్దిగా వేస్తూ కలపుతూ వేయించాలి. ఆ తరువాత పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలియబెట్టి సన్నటి మంటపై ఉడికించాలి.

ఆ తరువాత వేరే గిన్నెలో పగులగొట్టి చిలకొట్టి పెట్టుకున్న కోడిగ్రుడ్ల మిశ్రమాన్ని పోసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిన తరువాత, చివర్లో కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. అంతే ఆనియన్ ఎగ్ పరోటా రెడీ అయినట్లే...! ఈ ఆనియన్ ఎగ్ పరోటాకు చిల్లీసాస్, టమోటాసాస్‌లను సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu