Publish Date: Fri, 09 Jan 2009 (11:00 IST)
Updated Date: Fri, 09 Jan 2009 (10:59 IST)
కావలసిన పదార్థాలు :
బియ్యం... అరకేజీ
మినప్పప్పు... పావుకేజీ
ఉల్లిగడ్డలు... రెండు
పచ్చిమిర్చి... 10 కాయలు
అల్లం... చిన్నముక్క
నూనె... సరిపడా
కొత్తిమీర... ఒక కట్ట
జీలకర్ర... ఒక టీస్పూను
తయారీ విధానం :
మినప్పప్పు, బియ్యాన్ని కలిపి శుభ్రం చేసుకుని నాలుగు గంటలపాటు నాననిచ్చి, రుబ్బుకుని ఒక పూట పిండిని అలాగే ఉంచేయాలి. తరువాత ఉల్లిగడ్డలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర కడిగి సన్నగా ముక్కలు తరిగి పిండిలో కలపాలి.
ఆ పిండిని దోశెల పిండిలాగా కలుపుకుని పొయ్యిమీద పెనాన్ని పెట్టి బాగా కాలిన తరువాత... ఒక గరిటెడు పిండిని పోసి కొద్దిగా పెనంమీద పిండిని సర్ది అటూ ఇటూ కాల్చి తీసేయాలి. దీనికి దోశెలాగా పల్చగా పిండిని కలపకూడదు. ఇది కొంచెం మందంగా ఉండాలి. ఇలా తయారు చేసిన ఊతప్పాన్ని కొబ్బరి చట్నీతో కలిపి నంజుకుని తింటే చాలా బాగుంటుంది.