Article Fast Food %e0%b0%85%e0%b0%9f%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%b2 %e0%b0%aa%e0%b1%81%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b9%e0%b1%8b%e0%b0%b0 108030400034_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అటుకుల పులిహోర

Advertiesment
అటుకుల పులిహోర
కావాలసిన పదార్థాలు:
అటుకులు : పావుకిలో
మినప పప్పు : 2 స్పూన్లు
పెసరపప్పు : 2 స్పూన్లు
ఆవాలు : స్పూన్లు
పచ్చిమిరపకాయలు : నాలుగు
కరివేపాకు : రెండు రెమ్మలు
ఇంగువ : చిటికెడు
నూనె : స్పూన్లు
నిమ్మకాయలు : రెండు
వేరు శనగపప్పులు : కాసిని
పసుపు : చిటికెడు

తయారీ విధానం:
అటుకులను శుభ్రం చేసి నీళ్లతో కడిగి అందులో ఉన్న నీళ్లను పూర్తిగా వంపేయాలి. ఆ తర్వాత మూతపెట్టి గంటసేపు అలాగే ఉంచాలి. ఓ బాణలి తీసుకుని అందులో నూనె వేసి, పోపుకు సంబంధించిన సామానును వేయాలి.

పోపు పదార్థాలు వేగిన తర్వాత దానికి ఎండు మిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలను కలిపి మరికొద్దిసేపు వేయించాలి. ఆ తర్వాత అందులో అటుకులను కూడా వేసి కొద్ది సేపు వేయించాలి.

నిమ్మరసంలో తగినంత ఉప్పు, పసుపు, ఇంగువ పొడి వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. చివరిగా అన్నీ కలిపిన నిమ్మరసాన్ని అటుకుల్లో కలపటంతో అటుకుల పులహోర రెడీ అయినట్లే.

Share this Story:

Follow Webdunia telugu