Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వర్షాల్లో ఆరోగ్యానికి మేలు చేసే మిరియాలు.. పెప్పర్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలి

వర్షాలు పడుతున్నాయి. ఆరోగ్యంపట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. జలుబు, జ్వరాలు సులభంగా వచ్చేస్తాయి. అందుచేత పసుపు, మిరియాలను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మిరియాలను వర

వర్షాల్లో ఆరోగ్యానికి మేలు చేసే మిరియాలు.. పెప్పర్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలి
, గురువారం, 23 జూన్ 2016 (15:43 IST)
వర్షాలు పడుతున్నాయి. ఆరోగ్యంపట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. జలుబు, జ్వరాలు సులభంగా వచ్చేస్తాయి. అందుచేత పసుపు, మిరియాలను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మిరియాలను వర్షాకాలంలో డైట్‌లో చేర్చుకోవడం ద్వారా అజీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

వర్షాకాలం పిల్లల్లో అజీర్తి సమస్యలను దరిచేరనీయకుండా ఉంచాలంటే.. వంటకాలలో మిరియాల్ని చేర్చడం తప్పనిసరి. మిరియాల్లో బి కాంప్లెక్స్ విటమిన్స్, బిటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. అలాంటి మిరియాలతో ఎగ్ పెప్పర్ ఫ్రై ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావాలసిన పదార్థాలు : 
కోడిగుడ్లు - నాలుగు 
నూనె - తగినంత 
మిరియాల పొడి - రెండు టేబుల్ స్పూన్లు 
పచ్చిమిర్చి - ఒక టీస్పూన్  
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్ 
పసుపు పొడి - పావు టీ స్పూన్ 
కరివేపాకు - పావు కప్పు 
ఉప్పు - తగినంత  
బియ్యం పిండి - పావు కప్పు 
 
తయారీ విధానం :
ముందుగా ఒక బౌల్‌లో బియ్యం పిండిని వేసి అందులో పచ్చిమిర్చి తరుగును చేర్చుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, పసుపు పొడి, ఉప్పు, కరివేపాకు చేర్చి కొంచెం నీటితో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించి సగానికి కట్ చేసిన కోడిగుడ్లకు పట్టించి అర్థగంట పాటు పక్కనపెట్టాలి. అరగంట తర్వాత చిన్నపాటి పాన్‌లో నూనె పోసి మసాలా పట్టించిన ఎగ్‌ను నూనెలో దోరగా వేసి.. సర్వింగ్ ప్లేటులోకి తీసుకుని సాస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. అంతే ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ అయినట్లే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జుట్టు నిగనిగలాడాలంటే.. అలెవెరా ప్యాక్ వేసుకోండి.