జుట్టు నిగనిగలాడాలా? జుట్టు నెరసిపోవడానికి బ్రేక్ వేయాలా? అయితే ఈ ప్యాక్ ట్రై చేయండి. కలబంద గుజ్జును బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గుజ్జులో ఓ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌ను కలిపి ఈ ప్యాక్‌ను మాడుకు పట్టించండి. 15 నిమిషాల పాటు తర్వాత శుభ్రం చేసుకుంటే కురులు నిగనిగలాడుతాయి. నాలుగు రోజులకు ఓసారి ఇలా ఆలివ్ ఆయిల్, అలెవెరా ప్యాక్‌ను వేసుకుంటే కురులకు ప్రత్యేకమైన అందం సంతరించుకుంటుంది.
అంతేగాకుండా.. జుట్టు నెరవడం తగ్గడంతో పాటు జుట్టు నిగనిగలాడుతోంది. ఇంకా కురులు బ్రౌన్ రంగులో మెరవాలంటే ఇదే కలబంద గుజ్జుతో గోరింటాకు పొడి, ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని పట్టించాలి. గుజ్జును మాడుకు కురులకు పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే.. జుట్టుకు మంచి రంగు వస్తుంది.