కావలసిన పదార్థాలు: పచ్చిబఠాణి - ముప్పావు కప్పు ఉల్లి తరుగు - పావు కప్పు వెల్లుల్లి తరుగు - 1 స్పూన్ నూనె - 2 స్పూన్స్ ఉప్పు, మిరియాల పొడి - తగినంత పుదీనా తరుగు - 1 స్పూన్ క్యారెట్ తరుగు - 1 స్పూ
Advertiesment
, సోమవారం, 24 సెప్టెంబరు 2018 (12:59 IST)
కావలసిన పదార్థాలు:
పచ్చిబఠాణి - ముప్పావు కప్పు
ఉల్లి తరుగు - పావు కప్పు
వెల్లుల్లి తరుగు - 1 స్పూన్
నూనె - 2 స్పూన్స్
ఉప్పు, మిరియాల పొడి - తగినంత
పుదీనా తరుగు - 1 స్పూన్
క్యారెట్ తరుగు - 1 స్పూన్
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఉల్లిపాయ, వెల్లుల్లి తరుగును వేయించుకోవాలి. ఆ తరువాత పచ్చిబఠాణితో పాటు రెండు కప్పుల నీరు, ఉప్పు కలిపి మరిగించాలి. బఠాణి మెత్తబడ్డాక దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత మిక్సీలో పేస్ట్‌లా తయారుచేసుకుని మరోసారి స్టౌవ్‌పై పెట్టి ఉప్పు, మిరియాలపొడి కలిపి కొద్దిసేపు మరిగించి దించేయాలి. అంతే... వేడివేడి పచ్చిబఠాణీ సూప్ రెడీ.