Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాస్తా బిర్యానీ...

Advertiesment
పాస్తా బిర్యానీ...
, సోమవారం, 10 డిశెంబరు 2018 (11:18 IST)
కావలసిన పదార్థాలు:
పాస్తా - 1 కప్పు
బిర్యానీ మసాలా - 1 స్పూన్
బీన్స్, క్యారెట్ ముక్కలు - పావుకప్పు
ఉల్లిపాయ - 1
కొత్తిమీర - కొద్దిగా
పుదీనా - కొద్దిగా
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా పాస్తాను నీటిలో ఉడికించి నీరంతా వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, క్యారెట్, వేసి సన్నని మంటపై ఉడికించుకోవాలి. ఆ తరువాత ఉప్పు, బిర్యానీ పొడి, పుదీనా, కొత్తిమీర వేసి మరికొద్దిసేపు ఉడికించాలి. చివరగా ఉడికించిన పాస్తా వేసి కాసేపు వేయించి తీసుకుంటే టేస్టీ టేస్టీ పాస్తా బిర్యానీ రెడీ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆలివ్ నూనెను మరిగించి ఇలా చేస్తే..?