వంకాయలోని న్యూట్రియన్ ఫాక్ట్స్ శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. దాంతోపాటు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇన్‌ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. చర్మం దురదలను తగ్గిస్తుంది. ఇలాంటి వంకాయతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
వంకాయలు - అరకిలో
ఎండుకొబ్బరి పొడి - 1 కప్పు
ఉల్లిపాయ - 1
వెల్లుల్లి - పావుకప్పు
జీలకర్ర - 2 స్పూన్స్
ఆవాలు - 1 స్పూన్
పసుపు - చిటికెడు
కారం - 2 స్పూన్స్
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
కరివేపాకు - కొద్దిగా.
తయారీ విధానం:
ముందుగా ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి పొడి, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర వేసి మసాలా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి ఆ తరువాత వంకాయ ముక్కలు వేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో మసాలా ముద్ద వేసి నూనె పైకి తేలెంత వరకూ వేగనిచ్చి ఇందులో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం జతచేసి సన్నని మంట మీద ఓ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే... వంకాయ ఫ్రై రెడీ.