Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హాట్‌ అండ్‌ సోర్‌ వెజ్‌ సూప్‌‌ను వింటర్లో తీసుకుంటే?

Advertiesment
Hot And Sour Soup Recipe
హాట్‌ అండ్‌ సోర్‌ వెజ్‌ సూప్‌‌ను వింటర్లో తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినట్లవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కూరగాయల్ని తీసుకోవడం ద్వారా కంటిదృష్టి లోపాలను దూరం చేసుకోవడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఇంకా సూప్‌లో చేర్చే మిరియాలు.. జలుబు, దగ్గు నుంచి శీతాకాలంలో ఉపశమనాన్నిస్తాయి. అందుకే వింటర్‌లో ఈవెనింగ్ స్నాక్స్‌లో హాట్ అండ్ సోర్ వెజ్ సూప్‌ను టేస్ట్ చేయండి. ఎలా చేయాలంటే..? 
 
కావలసిన పదార్థాలు :
పండుమిర్చి పేస్ట్‌ - ఒక టీ స్పూను
క్యారెట్‌, బీన్స్, కీరదోస, మష్రూమ్ తరుగు - తలా అరకప్పు
ఉల్లికాడల తరుగు - ‌రెండు స్పూన్లు 
కార్న్‌ఫ్లోర్‌ - ఒక టీ స్పూన్ 
ఉప్పు- తగినంత
మిరియాల పొడి - పావు టీ స్పూన్ 
నూనె - ‌ఒక టీ స్పూన్ 
టొమోటో సాస్‌ - ‌ఒక టీ స్పూన్
 
తయారీ విధానం : 
ముందుగా పాన్‌లో నూనె వేడి చేసి అందులో క్యారెట్‌, బీన్స్‌, కీరదోస, పుట్టగొడుగుల తరుగు వేసి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, మిరియాల పొడి, ఉల్లికాడల తరుగు, టమోటా సాస్ తగినంత నీరు, ఉప్పు చేర్చి పది నిమిషాలు ఉడికించి స్టౌపై నుంచి దించేయాలి. అంతే సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని నూనెలో వేపిన చిన్న చిన్న పనీర్ ముక్కలతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. అంతేగాకుండా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.

Share this Story:

Follow Webdunia telugu