Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేఎఫ్‌సీ చికెన్ ఇంట్లోనే ఎలా చేయాలి?

Advertiesment
Home made KFC chicken
అసలే వేసవి కాలం. పిల్లలకు సెలవులొచ్చేశాయ్. వారికి ఈవెనింగ్ స్నాక్స్‌గా రోజుకో వెరైటీ ట్రై చేయండి. ఈ కోవలో కేఎఫ్‌సీ లాంటి చికెన్ ఇంట్లోనే ట్రై చేయండి. 
 
కావలసిన పదార్థాలు : 
చికెన్- అరకేజీ 
టమోటా సాస్ - 1 స్పూన్ 
సోయి సాస్ - 1 స్పూన్  
చిల్లీ సాస్ - 2 స్పూన్లు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు 
మిరియాల పొడి - అర టీ స్పూన్ 
మైదా - ఒక కప్పు 
పసుపు పొడి- అర స్పూన్  
కోడిగుడ్డు - ఒకటి 
బ్రెడ్ పౌడర్ - ఒక కప్పు 
ఉప్పు - తగినంత  
 
తయారీ విధానం :
ముందుగా చికెన్ ముక్కల్ని శుభ్రం చేసుకుని.. ఓ బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ చికెన్ ముక్కలకు టమోటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలపొడి, ఉప్పు, తగినంత నీరు చేర్చి పది నిమిషాల పాటు ఉడికించాలి. చికెన్ ముక్కలు ముప్పావు ఉడికాక దించేయాలి. 
 
తదనంతరం మరో పాన్ తీసుకుని అందులో ఉప్పు, మైదా, మిరియాల పొడి, పసుపు పొడి.. గిలకొట్టి పెట్టుకున్న కోడిగుడ్డు, తగినంత నీరు చేర్చి జారుగా కలుపుకోవాలి. మరో ప్లేటులో బ్రెడ్ పొడి తీసిపెట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేడయ్యాక చికెన్ ముక్కల్ని.. మైదా ముంచి బ్రెడ్ పౌడర్‌లో అటూ ఇటూ తిప్పి నూనెలో దోరగా వేపుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన చికెన్ ముక్కల్ని మైదా పిండి మిశ్రమంలో ముంచి.. ఆ పై బ్రెడ్ పౌడర్లో తిప్పి... నూనెలో ఫ్రై చేసుకుంటే హాట్ హాట్‌గా సర్వ్ చేస్తే కేఎఫ్‌సీ చికెన్‌లా టేస్ట్ అదిరిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu