ఎర్రటి రంగు లేదా పింక్ కలర్:
ఈ రెండు రంగుల లిప్‌స్టిక్‌లు గాఢమైన అనుభూతిని ఇస్తాయి. అయితే ఎర్రని రంగు కలిగిన ఉన్నవారికి అయితే ఈ రంగులు బాగా సూట్ అవుతాయి. అందుకే పెదవుల రంగుతోపాటు శరీర రంగును కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రంగుల లిప్‌స్టిక్‌లను వాటితే సరిపోతుంది.
ఎల్లో లేదా ఆరెంజ్:
ఈ రంగులు సున్నితమైన భావాలను కలిగిస్తాయి. ముదురు రంగు శరీరం కలిగినవారు ఈ రంగు లిప్‌స్టిక్‌లను వాటితే సరిపోతుంది. అంటే తెలుపు లేదా ఎరుపు రంగు చర్మం గలవారు వీటిని ఉపయోగించాలి. పాలిపోయిన రంగు శరీరం కలవారికి ఈ రంగుల లిప్‌స్టిక్ నప్పదు.
బ్లూ, గ్రీన్:
ఈ రంగు లిప్‌స్టిక్‌లు అవతలివారిని ఆకర్షిస్తుంది. గాఢమైన ప్రభావం కలిగిన బ్లూ రంగు లిప్‌స్టిక్‌లను రాత్రిపూటకంటే, పగటి సమయాల్లో వాడితేనే మంచిది. అరుదైన సందర్భాల్లో తప్ప, ప్రతిరోజూ వాడకపోతే మరీ మంచిది. ఇక ఆకుపచ్చ రంగు లిప్‌స్టిక్‌ను ఎక్కువగా వాడకపోవడం ఉత్తమం. ఎందుకంటే ఇది చూసేందుకు మరీ ప్రత్యేకంగా కనిపిస్తుంది.