Publish Date: Tue, 20 Jan 2015 (13:06 IST)
Updated Date: Tue, 20 Jan 2015 (13:08 IST)
మహిళల వెంట తప్పనిసరిగా ఉండాలనుకునే యాక్సెసరీ హ్యాండ్ బ్యాగ్. ఖరీదైన బ్యాగుల్ని కొంటున్నప్పుడు చిన్న చిన్న సమస్యలకే దాన్ని పక్కన పడేయాలంటే మనసొప్పదు. అందుకే ఎవి ఎక్కవ కాలం మన్నేలా జాగ్రత్త పడాలి.
ఆ జాగ్రత్తలు ఏమిటంటే.. కొత్త బ్యాగుకు ఉండే ధర ట్యాగ్‌లను తీసి భద్రపరచండి. దాని మీదే బ్యాగును శుభ్రపరిచే విధానం ఉంటుంది.
* లెదర్ బ్యూగ్‌లలో పదునైన వస్తువులను పెడితే లోపలి కవరు చిరిగిపోతుంది. అలాంటి వస్తువులు పెట్టడం తప్పనట్లైతే మెత్తటి వస్త్రంలో చుట్టి పెట్టాలి.
* బ్యాగు పెద్దదైనప్పటికీ ఏవి పడితే వాటిని లోపలి పెట్టి కుక్కేయకండి. బ్యాగులో భద్రపరిచే ఏ వస్తువైనా అందుకో కవర్ వేసి.. హ్యాండ్ బాగులో సర్దుకోవాలి.
* బ్యాగు నుంచి దుర్వాసన వస్తున్నప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవచ్చు. కానీ నెలకోసారి బ్యాగును శుభ్రం చేసుకోవాలి. బ్యాగ్ పైభాగంలో ఇంకు మరకలు పడితే వెనిగర్‌తో కొంచెం వంట సోడా కలిపి బ్రష్ ముంచి మరకలపై రుద్దాలి. ఆరాక ఆలివ్ ఆయిల్ నూనెలో ముంచినట్లైతే దూదితో బ్యాగ్ తుడిస్తే సరి. కొత్తదానిలా మెరసిపోతుంది.