Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

image

ఐవీఆర్

, బుధవారం, 18 సెప్టెంబరు 2024 (23:01 IST)
హైదరాబాద్‌లో అతిపెద్ద, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న డిజైన్ ఫెస్టివల్, డిజైన్ డెమోక్రసీ 2024, అక్టోబర్ 4 నుండి 6, 2024 వరకు, హైటెక్స్ , హాల్స్ 1, 3లో జరుగనుంది. ఈ అసాధారణ కార్యక్రమం క్రియేటర్లు, నిపుణులు, ఔత్సాహికులను ఒకే విధంగా ఆకర్షించటంతో పాటుగా డిజైన్, కళ మరియు ఆవిష్కరణల కలయికకు హామీ ఇస్తుంది. పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ మరియు అర్జున్ రాఠీ నేతృత్వంలో జరుగనున్న ఈ ఫెస్టివల్ నగరం యొక్క డిజైన్ ల్యాండ్‌స్కేప్‌ను మార్చే ఒక మైలురాయి కార్యక్రమంగా భావించబడుతుంది. తెలంగాణ మ్యూజియం నుండి బ్రాండ్ డైరెక్టర్ మాన్సీ నేగి మరియు క్యూరేటర్ సుప్రజా రావు, అసాధారణమైన షోకేస్‌లను క్యూరేట్ చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు.
 
"ఈ సంవత్సరం, మేము డిజైన్ ఫెస్టివల్స్ సాధించగల సరిహద్దులను పునర్నిర్వచించాము" అని డిజైన్ డెమోక్రసీ వ్యవస్థాపకులు పల్లికా శ్రీవాస్తవ్ అన్నారు. “మా లక్ష్యం మార్పును ప్రేరేపించడానికి మరియు సహకారాన్ని ప్రోత్సహించడానికి ఆవిష్కరణ, కళ మరియు రూపకల్పన కలిసిపోయే వేదికను సృష్టించడం. సృజనాత్మకత పరంగా  వైవిధ్యాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్ ట్రెండ్‌లకు వేదికను ఏర్పాటు చేయడం గురించి డిజైన్ డెమోక్రసీ 2024 నిర్వహించబడుతుంది" అని అన్నారు. 
 
డిజైన్ డెమోక్రసీ సహ-వ్యవస్థాపకురాలు శైలజా పట్వారీ మాట్లాడుతూ “హైదరాబాద్‌కు హస్తకళ మరియు ఆవిష్కరణల గొప్ప చరిత్ర ఉంది. ఆధునిక డిజైన్ యొక్క సరిహద్దులను అధిగమిస్తూ ఈ వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రాంగణాన్ని  సృష్టించడం మాకు గర్వకారణంగా ఉంది" అని అన్నారు. 
 
ఈవెంట్ యొక్క క్యూరేటర్, అర్జున్ రాఠి, ప్రదర్శనలో ఉన్న ప్రత్యేకమైన కళాత్మక వ్యక్తీకరణల పట్ల తన సంతోషం  వ్యక్తం చేశారు. “డిజైన్ డెమోక్రసీ 2024 అనేది అన్ని రూపాల్లో సృజనాత్మకత యొక్క వేడుక. లైటింగ్, ఫర్నిచర్ నుండి ఆర్కిటెక్చరల్ ఫోటోగ్రఫీ మరియు స్థానిక ప్రతిభ వరకు, ఈ ఫెస్టివల్ డిజైన్‌లో ఉత్తమమైన వాటిని అందిస్తుంది. " అని అన్నారు. 
 
ఈ సంవత్సరం డిజైన్ డెమోక్రసీ యొక్క ప్రధాన స్పాన్సర్‌లుగా కీయస్ స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ (గోల్డ్ స్పాన్సర్‌)గా మరియు టబు వెనీర్స్ (సిల్వర్ స్పాన్సర్‌) గా ఉన్నారు. ఆర్కిటెక్చర్+డిజైన్, డిజైన్ పటాకిలు మీడియా పార్టనర్స్ గా వ్యవహరిస్తున్నాయి. మృణాళిని ఘడియోక్, స్నేహ ఉల్లాల్ గోయెల్ మరియు ఐసోలా డిజైన్ గ్రూప్ దాని అవుట్‌రీచ్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎస్టాబ్లిష్, ఎపిస్టిల్ మరియు ది పర్పుల్ బోట్ వంటి డిజైన్ భాగస్వాములుగా ఉన్నారు. డిజైన్ డెమోక్రసీ వెంచర్స్ దీనికి మద్దతునిస్తున్నాయి. 
 
ఈ ఫెస్టివల్‌లో లైటింగ్, ఆర్ట్, ఫర్నిచర్, రగ్గులు మరియు యాక్సెసరీస్‌ విభాగాలతో సహా బహుళ విభాగాలలో ఎగ్జిబిటర్‌లు తమ ఉత్పతులు ప్రదర్శిస్తున్నారు. వీటిలో ప్రముఖ లైటింగ్ బ్రాండ్‌లైన శైలేష్ రాజ్‌పుత్ స్టూడియో, అర్జున్ రాఠి మరియు ది లుమి షాప్ నుండి అద్భుతమైన పనితనం వీక్షించవచ్చు. స్టూడియో స్మితా మోక్ష్, విధి గుప్తా మరియు కడారి ఆర్ట్ గ్యాలరీ మొదలైన వారి కళాఖండాలను అన్వేషించవచ్చు. రోసాబాగ్, రవీష్ వోహ్రా హోమ్ మరియు సరితా హండా నుండి ఫర్నిచర్ కలెక్షన్, కార్పెట్ సెల్లార్ మరియు కోకూన్ రగ్గుల నుండి ఆకట్టుకునే రగ్గులు  ప్రదర్శనలో ఉంటాయి. సైజల్ గోయెంకా, ఒలీ మేటీ మరియు స్టూడియో B.E.A.D. వంటి డిజైనర్ల నుండి ప్రత్యేకమైన ఉపకరణాలను కూడా సందర్శకులు కనుగొనవచ్చు. 
 
 ప్రత్యేకించి  తెలంగాణ ప్రతిభ మరియు నైపుణ్యానికి నిజమైన వేడుక, డిజైన్ డెమోక్రసీ 2024. ఇది స్థానిక డిజైన్ యొక్క గొప్ప వారసత్వాన్ని హైలైట్ చేస్తుంది. స్థానిక వాస్తుశిల్పుల అద్భుతమైన పనితనం సైతం ప్రదర్శిస్తుంది. ఈ ఫెస్టివల్ మరొక ఉత్తేజకరమైన ఫీచర్ డిజైన్ పిక్సెల్, ఇది భారతదేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్‌లచే ఆర్కిటెక్చరల్ ఫోటోగ్రఫీని ప్రదర్శించే అద్భుతమైన గ్యాలరీ. ఈ గ్యాలరీ సందర్శకులకు నిర్మాణ అద్భుతాలు మరియు వాటి వెనుక ఉన్న అద్భుతమైన కథలతో దృశ్య ప్రయాణాన్ని చేయించనుంది. ప్రదర్శనలతో పాటుగా ఈ రంగాలలోని పలువురు ఉద్దండుల చేత  ప్యానెల్ చర్చలు,  సృజనాత్మక వ్యక్తీకరణ వంటివి కూడా ఉంటాయి. 
 
ఉత్సవాల్లో భాగంగా, కీయస్ స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ అక్టోబర్ 5న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని స్టోన్ లైఫ్‌లో ఒక ప్రత్యేకమైన శాటిలైట్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. అక్టోబరు 4న ఇన్వైట్ ఓన్లీ లాంచ్ పార్టీతో సహా ఫెస్టివల్ లో పుష్కలంగా నెట్‌వర్కింగ్ అవకాశాలు కూడా అందిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌