Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాక్ వే శీతాకాలం-2023 సెలక్షన్‌తో మీ ఫుట్ వేర్ గేమ్‌ని పెంచుకోండి

Advertiesment
image
, బుధవారం, 1 నవంబరు 2023 (22:41 IST)
మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ నుంచి వస్తోన్న అత్యంత నాణ్యమైన ఉత్పత్తుల్లో వాక్ వే కూడా ఒకటి. ఇప్పటికే ఎన్నో మోడల్స్‌తో నేటి యువతరాన్ని ఆకట్టుకున్న వాక్ వే ఇవాళ... నేటి అవసరాలకు అనువైన ఫుట్ వేర్‌ను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. 2023 ఏడాదికి సంబంధించి శీతాకాలం మొదలైంది. అందుకోసం మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ కూడా శీతాకాలం కలెక్షన్‌ను విడుదల చేసింది. ఈ శీతాకాలం కొత్త కలెక్షన్ వేడుకల యొక్క స్పిరిట్, స్టైల్ మరియు కంఫర్ట్ అందించేలా సిద్ధం చేశారు. మీరు స్నేహితులతో కలిసి వెళ్తున్నా, ఏదైనా పనిలో ఉన్నా, లేదా ప్రత్యేక పనులు లేదా ప్రత్యేక ఈవెంట్‌లో బిజీగా ఉన్నా కూడా.. ఇలా ప్రతీ సందర్భానికి తగినట్లు మీకు అద్భుతంగా సూట్ అయ్యే ఫుట్ వేర్‌ని వాక్‌వే అందిస్తుంది. ఈ సీజన్‌లో మీ దుస్తులకు తగినట్లు ఎలివేట్ అయ్యేలా విభిన్న శైలులను అందిస్తుంది వాక్ వే.
 
ఈ సేకరణలో ఫ్యాషన్ ని అమితంగా ఇష్టపడే పురుషులు, మహిళల కోసం అద్భుతమైన స్టైల్స్ ఉన్నాయి. ఇవి ఫ్యాషన్, కంఫర్ట్ యొక్క ఖచ్చితమైన సమ్మేళనంగా ఉంటాయి. ఇది మీ రోజువారీ ఫుట్ వేర్ అవసరాలకు సరైన ఎంపికగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. క్లాసిక్ లేత గోధుమరంగు బ్యూటీస్ నుండి ట్రెండీ టెక్స్‌చర్డ్ బ్రోగ్‌లు, మహిళల కోసం చిక్ ఫ్లాట్‌లు, వెడ్జీలు, అలాగే అధునాతన లోఫర్‌లు, ఫార్మల్ ఫుట్‌వేర్ ఆప్షన్‌లు, పురుషుల కోసం స్నీకర్లు, చెప్పులు ఇలా ప్రతీ ఒక్కటీ... వాక్‌వే యొక్క శీతాకాలం 2023 కలెక్షన్‌లో ప్రతి ఒక్కరికీ ఉంది.
 
“వాక్‌వే కొత్త సెలెక్షన్ మా వినియోగదారుల యొక్క రోజువారీ ఫ్యాషన్ గేమ్‌ను విశ్వాసంతో మరింత ముందుకు తీసుకెళ్తుంది. మనకు నచ్చిన ఫుట్ వేర్ ఉపయోగిస్తే ప్రతి సందర్భం గుర్తుండిపోతుంది. అంతేకాకుండా ప్రతి అడుగు ఒక ప్రకటనగా ఉండాలని మేము విశ్వసిస్తున్నాము. ఎందుకంటే ప్రతి వ్యక్తి చక్కగా, సౌమ్యంగా కన్పించేందుకు అర్హుడు అని అన్నారు మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్, వాక్‌వే షూస్ బిజినెస్ హెడ్ మనోజ్ సింగ్.
 
వాక్‌వే యొక్క శీతాకాలం 2023 సెలక్షన్ ప్రతి స్టైల్ ఒక ప్రత్యేకమైన అందాన్ని జోడించే విధంగా ఉంటుంది. దీంతోపాటు సరైన ఫుట్ వేర్ రేంజ్ తో మీ స్టైల్ ని సరికొత్తగా అప్‌గ్రేడ్ చేయడంలో మీకు సహాయపడుతుంది. విభిన్నమైన విస్తృత శ్రేణి రంగులలో అందుబాటులో ఉన్న ఈ స్టైల్స్ భారతదేశంలోని 50 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సరికొత్త సెలెక్షన్ రూ. 499 నుంచి ప్రారంభమవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రోటీన్ పౌడర్‌లకు బదులుగా ఇవి తీసుకోండి..