Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

image

ఐవీఆర్

, బుధవారం, 18 సెప్టెంబరు 2024 (23:13 IST)
బెంగళూరుకు చెందిన 100 ఏళ్ల చరిత్ర మరియు వారసత్వం కలిగిన ఫ్యాషన్ బ్రాండ్, దేశంలోనే అత్యుత్తమ పురుషుల సూట్ మేకర్ పిఎన్ రావు ( PN RAO) , తెలంగాణలోని అత్యున్నత ఫ్యాషన్ నగరమైన హైదరాబాద్‌లో తన ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ఈరోజు ప్రారంభించింది. సుసంపన్నమైన జూబ్లీ హిల్స్‌ లో ఉన్న ఈ పిఎన్ రావు స్టోర్ దక్షిణ భారతదేశంలో సంస్థకు 8వ స్టోర్ కాగా ఈ ప్రాంతం అంతటా దాని కార్యకలాపాలను విస్తరించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
 
ఈ స్టోర్‌ను శ్రీ మచ్చేందర్ పిషి, పార్టనర్ పిఎన్ రావు, సంస్థ రెండవ తరం వ్యాపారవేత్త శ్రీ కేతన్ పిషి, పార్టనర్, పిఎన్ రావు మరియు మూడవ తరం  వ్యాపారవేత్త శ్రీ నవీన్ పిషి, పార్టనర్, పిఎన్ రావు ప్రారంభించారు. పిఎన్ రావు భాగస్వామి, కేతన్ పిషి మాట్లాడుతూ, “ తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న యువత మరియు నాణ్యత పట్ల అత్యున్నత స్పృహ కలిగిన జనాభాతో శక్తివంతమైన, ఫ్యాషన్ స్పృహ కలిగిన నగరం హైదరాబాద్. ఈ నగరానికి పిఎన్ రావు వంటి స్టోర్ అవసరం. మేము హైదరాబాద్ మరియు తెలంగాణ జనాభా అవసరాలను తీర్చడానికి సరైన సమయంలో స్టోర్ ప్రారంభించడం పట్ల  సంతోషిస్తున్నాము. దేశంలో ఎక్కువ మంది ఇష్టపడే పురుషుల సూట్ బ్రాండ్‌గా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని పిఎన్ రావు ఏర్పరచుకుంది. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించటంతో, నగరంలో తన ఉనికిని చాటుకోవడానికి పిఎన్ రావు సిద్ధంగా ఉంది, నాణ్యతను కోరుకునే ప్రజల అవసరాలను తీర్చటంతో పాటుగా త్వరలో వారికి ఇష్టమైనదిగా ఉద్భవించనుంది. నగరంలోకి పిఎన్ రావు ప్రవేశం సమయానుకూలంగా ఉండటంతో పాటుగా మరియు వ్యూహాత్మకమైనది, ఇది రెడీ టు వేర్ వస్త్రాలు మరియు అసాధారణమైన నాణ్యతతో చక్కదనంను సజావుగా మిళితం చేసే క్లాసిక్ బెస్పోక్ టైలరింగ్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చనుంది" అని అన్నారు.
 
పిఎన్ రావు యొక్క బెస్పోక్ అనుభవంలో ఒక ప్రత్యేకమైన సూట్ కాన్సర్జీ సేవ ఉంటుంది. ఇది పురుషుల ఫైన్ సూటింగ్ పరిశ్రమలో మొదటిసారిగా అందుబాటులోకి వచ్చిన ఆఫర్. దీనితో, కస్టమర్‌లు తమ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్‌తో ప్రైవేట్ అపాయింట్‌మెంట్‌లను సమయానికి ముందే షెడ్యూల్ చేయవచ్చు, పూర్తి అంకితభావంతో, నిరంతరాయమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఫాబ్రిక్ ఎంపికల గురించి చర్చించడానికి ముందస్తు సంప్రదింపులైనా, లేదా తగిన సిఫార్సులతో కూడిన టైలర్ సూచనలతో కూడిన  సెషన్ అయినా, సూట్ కాన్సర్జీ సేవ అరుదుగా కనిపించే వ్యక్తిగతీకరణ స్థాయిని అందిస్తుంది. ఈ సేవ వ్యక్తిగత దృష్టిని అందించడంలో బ్రాండ్ యొక్క నిబద్ధతను పెంచుతుంది మరియు షాపింగ్ ప్రయాణాన్ని మరింత ఆలోచనాత్మకంగా మరియు ప్రతి క్లయింట్ యొక్క అవసరాలకు అనుగుణంగా చేస్తుంది.
 
కేతన్ పిషి మాట్లాడుతూ “ఒకవైపు మేము మా కస్టమర్‌లకు అత్యుత్తమమైన దుస్తులను అందించడానికి కట్టుబడి ఉన్నాము మరియు మా క్లయింట్ యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటాము, మరోవైపు మేము మా అత్యున్నతమైన కస్టమర్ సేవ మరియు వ్యక్తిగతీకరించిన సేవలతో మా కస్టమర్‌లను ఆహ్లాదపరిచేందుకు మరియు వారి అనుభవాలను పెంచడానికి మార్గాలను నిరంతరం అన్వేషిస్తున్నాము " అని అన్నారు. 
 
పిఎన్ రావు యొక్క భాగస్వామి నవీన్ పిషి  మాట్లాడుతూ, “దక్షిణ భారతదేశంలో మా 8వ స్టోర్‌ను జోడించడంతో పాటుగా  తెలంగాణలో రాబోయే అనేక ఇతర దుకాణాలలో భాగంగా హైదరాబాద్‌లో మొదటిది. తెలంగాణ మరియు హైదరాబాదీల పౌరులకు మా సేవల అనుభవాలను ఇక్కడ మొదటగా చూపనున్నాము. చక్కటి అభిరుచి తో కూడిన ప్రియమైన వినియోగదారుల కోసల హైదరాబాద్ నగరం మరియు మొత్తం తెలంగాణా రాష్ట్రం కోసం ఇష్టపడే ఫ్యాషన్ గమ్యస్థానంగా మారడానికి మా స్టోర్ సిద్ధంగా ఉంది” అని అన్నారు. 
 
పిఎన్ రావు యొక్క విస్తరణ ప్రణాళికలపై నవీన్ పిషి మాట్లాడుతూ, "ఫ్రాంచైజీ మార్గం ద్వారా దశలవారీగా దేశవ్యాప్తంగా ఈ లెగసీ బ్రాండ్‌ను మరింత లోతుగా మరియు విస్తృతంగా తీసుకెళ్లడమే మా లక్ష్యం. దీనిలో భాగంగా తొలుత , ఇతర ప్రాంతాలలోకి భౌగోళిక విస్తరణ కోసం  ఫ్రాంఛైజీని మేము గుర్తించాము, వారితో ముందుకు వెళ్ళటానికి ఒప్పందం చేసుకున్నాము. పిఎన్ రావు కస్టమర్ కేర్ నాణ్యతపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది మరియు దాని వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించడాన్ని కొనసాగిస్తుంది-ఇది పిఎన్ రావు బ్రాండ్ అమిత ప్రాధాన్యత ఇచ్చే సిద్దాంతం"  అని అన్నారు.
 
"పిఎన్ రావు దేశంలోనే అతిపెద్ద బెస్పోక్ టైలరింగ్ సౌకర్యాలలో ఒకటి బెంగళూరు శివార్లలో నిర్మించింది, ఇది పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది, ఇది మా దుస్తులను శుభ్రమైన, సురక్షితమైన మరియు పరిశుభ్రమైన తయారీ ప్రక్రియలో అందించే ప్రయత్నంలో పర్యావరణం మరియు సుస్థిరత పద్ధతుల పట్ల మా నిబద్ధతను ప్రదర్శిస్తుంది" అని నవీన్ పిషి  జోడించారు.
 
పిఎన్ రావు ఒక లేడీస్ వేర్ బ్రాండ్‌గా ప్రారంభించబడింది, ఇది స్వాతంత్ర్యానికి పూర్వం రోజులలో బ్రిటీష్ మహిళలను అలంకరించడంలో ఇది వ్యాపార కార్యకలాపాలను నిర్వహించేంది. స్వాతంత్య్రానంతరం, వ్యవస్థాపకుడి పెద్ద కుమారుడు దివంగత శ్రీ పాండురంగారావు పురుషుల సూట్‌ల నమూనా తయారీని నేర్చుకున్నారు, దీని వలన బ్రాండ్ పురుషుల దుస్తులలోకి మారడానికి దారితీసింది మరియు ఇప్పటి వరకు పురుషుల దుస్తులలో ఉత్తమమైన వాటిని అందించడానికి కట్టుబడి ఉంది. 2023లో తమ  100వ సంవత్సరంలో మహిళల కోసం సూట్‌లు మరియు ఫార్మల్ వేర్ కోసం బెస్పోక్ ఉమెన్ వేర్ ఆఫర్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. బ్రాండ్ పిఎన్ రావు, బెంగళూరులోని మహాత్మా గాంధీ రోడ్‌లో ఒకే స్టోర్‌ తో కార్యకలాపాలు  ప్రారంభించినప్పటికీ, ఈ రోజు బెంగళూరులో 5 మరియు చెన్నైలో 2 స్టోర్‌లు కలిగి ఉంది.
 
చక్కటి డిజైన్ మరియు హస్తకళా నాణ్యతపై ఆసక్తి  ప్రసిద్ధి చెందిన నగరం హైదరాబాద్. తమ అధునాతన అభిరుచులకు అనుగుణంగా ఫ్యాషన్ గమ్యస్థానం కోసం చాలా కాలంగా ఈ నగరం ఎదురుచూస్తోంది. ఈ  స్టోర్ హైదరాబాద్ యొక్క రిటైల్ రంగానికి కేవలం ఒక కొత్త జోడింపుగా  కంటే ఎక్కువగా ఉంటుందని హామీ ఇస్తుంది; ఇది నగరం యొక్క ఫ్యాషన్ ల్యాండ్‌స్కేప్‌కు గణనీయమైన వృద్ధిని సూచిస్తుంది. ఈ స్టోర్ కేవలం కొత్త రిటైల్ స్పాట్ కంటే ఎక్కువ; ఇది హైదరాబాద్ యొక్క ఫ్యాషన్ ల్యాండ్‌స్కేప్‌కి ఒక పెద్ద అప్‌గ్రేడ్, ఆధునిక పోకడలను క్లాసిక్ అధునాతనతతో మిళితం చేసే దుస్తులను ప్రదర్శిస్తుంది.
 
స్టోర్ ప్రారంభోత్సవం పట్ల నగరం పూర్తి సంతోషంగా ఉంది, ఇప్పటికే 150కి పైగా విచారణలు అందాయి, ఇది స్థానిక ప్రజల  నుండి బలమైన నిరీక్షణను ప్రతిబింబిస్తుంది. ఈ ఆశాజనక ప్రారంభం హైదరాబాద్‌లోని ప్రియమైన వినియోగదారుల  ఫ్యాషన్ అవసరాలు మరియు ప్రాధాన్యతలకనుగుణంగా  స్టోర్ యొక్క ఏర్పాటును  హైలైట్ చేస్తుంది. దాని రెడీ-టు-వేర్ కలెక్షన్‌లపై ఆసక్తి ఉన్న కస్టమర్‌లు గుర్తించదగిన రీతిలో రావటం , స్టోర్‌కు ప్రారంభ సందర్శనలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ప్రారంభ విజయం హైదరాబాద్‌లోని ఫ్యాషన్ ఔత్సాహికులకు త్వరగా ఇష్టమైనదిగా మారే స్టోర్ సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది.
 
మొట్టమొదటిసారిగా,  హైదరాబాద్‌లోని తన స్టోర్‌లో 3డి విజువలైజేషన్ టెక్నాలజీని పరిచయం చేస్తోంది, ఇక్కడ కస్టమర్ ఒక నిర్దిష్ట ఉత్పత్తి/వస్త్రాన్ని మోడల్‌లో స్కాన్ చేయవచ్చు మరియు కొనుగోలు చేయడానికి ముందు ఒక నిర్దిష్ట ఫాబ్రిక్ తనపై ఎలా కనిపిస్తుందో చూసుకోవచ్చు. పి ఎన్ రావు మూడు విస్తృత విభాగాలలో సూట్‌లను అందిస్తుంది. అవి  రెడీ-టు-వేర్; డిజైనర్ మేడ్-టు-మెజర్ కలెక్షన్  మరియు క్లాసిక్ బెస్పోక్ టైలరింగ్.  ఈ విభాగాల ద్వారా, తమ ఆఫరింగ్స్ సంపూర్ణంగా ఉండేలా పిఎన్ రావు  చూసుకున్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు