Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఇలాంటిది ఉంటే వెంట‌నే తీసేయండి

Advertiesment
goddess lakshmi
, గురువారం, 12 నవంబరు 2020 (16:45 IST)
లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధ‌నానికి అధిప‌తి. ఎవరికి ఐశ్యర్యం సిద్ధించాలన్నా, ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. అందుకే వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు, బొమ్మలు పూజిస్తారు. కానీ కొన్ని రకాల లక్ష్మీదేవి చిత్ర పటాలను పూజిస్తే ధనం రాదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా ఉన్న ధనం కూడా ఎలా వచ్చిందో అలాగే పోతుందట.
 
- గుడ్లగూబపై లక్ష్మీ దేవి కూర్చున్నట్టుగా ఉండే బొమ్మను పూజించకూడదు. దీంతో అంతా అశుభమే జరుగుతుందట. ధనం వచ్చింది వచ్చినట్టు పోతుంది.
 
- శేషతల్పంపై విష్ణువు పడుకుని ఉండగా, ఆయన కాళ్ల వద్ద లక్ష్మీ దేవి ఉన్న బొమ్మను పూజిస్తే అలాంటి వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుందట. అదే తామర పూవుపై లక్ష్మీదేవి నిలుచుని ఉన్న ఫొటో కాకుండా కూర్చున్నట్టుగా ఉన్న ఫొటోను పూజించాలట. 
 
- కుబేరుని విగ్రహం లేదా ఫొటోను ఇంట్లో పెట్టుకుంటే, దాంతో లక్ష్మీ దేవి మ‌రింత సంతృప్తి చెంది ఆ ఇంట్లోని వారికి ఐశ్వర్యాలను కలిగిస్తుందట.
 
- గరుత్మంతునిపై విష్ణువుతోపాటు లక్ష్మీ దేవి కూర్చుని ఉన్న ఫొటోను పూజించినా మిక్కిలిగా ధనం లభిస్తుందట. అంతా మంచే జరుగుతుందట.
 
- పాదరసంతో తయారు చేసిన లక్ష్మీ దేవి విగ్రహాన్ని పూజిస్తే దాంతో అన్నీ శుభాలే కలుగుతాయట. ధనం కూడా బాగా సమకూరుతుందట.
 
- దీపావళి రోజున స్ఫటిక శ్రీయంత్రాన్ని ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి దాన్ని మీ మనీ లాకర్‌లో పెట్టాలి. దీంతో ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది. లక్ష్మీ పూజ చేసేటప్పుడు తులసి ఆకులు, ధూపం, దివ్వెలు, పూవులను ఎక్కువగా వాడి పూజ చేయాలి. దీంతో అనుకున్నది జరుగుతుంది.
 
- దీపావళి రోజున లక్ష్మీ దేవి, కుబేరున్ని పూజించి అనంతరం ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. దీని వల్ల భక్తులకు అనుకున్నది నెరవేరుతుంది. 
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే
ధనధాన్యసమృద్ధిం మే దేహి దాపయ స్వాహా

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-11-2020 - గురువారం మీ రాశి ఫలితాలు - సాయిబాబా గుడిలో అన్నదానం..?