Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం.. చాక్లెట్ తిననిదే చీమైనా కదలదు..

Advertiesment
World Chocolate Day
, గురువారం, 7 జులై 2022 (14:14 IST)
World Chocolate Day
అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 7న జరుపుకుంటారు. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రజలు తమకు ఇష్టమైన చాక్లెట్ ట్రీట్‌లో మునిగిపోతారు.  
 
చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరి హృదయాల్లోనూ చాక్లెట్ చెరగని ముద్ర వేసుకుంది.  1800 కాలంలో బార్‌లలో అందించే పానీయంగా చాక్లెట్ ప్రారంభమైంది. ఆ తర్వాత అది పలు ఆకారాలుగా మారింది. రంగులను మార్చుకుంది. నట్స్‌ను చేర్చుకుంది. పండ్లను యాడ్ చేసుకుంది. వివిధ రకాలైన రుచుల్లో అందరికీ దగ్గరైంది.  
 
ప్రపంచవ్యాప్తంగా.తమిళనాడులోని నీలగిరి జిల్లాలో తయారు చేసే చాక్లెట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు నీలగిరి జిల్లాను సందర్శిస్తారు. వాటిని తయారు చేసే ప్రక్రియను, ఫ్యాక్టరీలను వీక్షించేందుకు వారు ఆరాటపడతారు. 
 
నీలగిరిలో 60 రకాల చాక్లెట్లు తయారు చేస్తారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా చాక్లెట్లు కూడా ఇక్కడ తయారుచేస్తారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు చాక్లెట్లు తింటే ఒత్తిడి పోతుందని తయారీదారులు చెబుతున్నారు. 
 
ఇక చాక్లెట్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఏ చిన్న సంతోషకరమైన మూమెంట్‌కు చాక్లెట్ తప్పనిసరిగా మారింది. అయితే సహజ సిద్ధమైన చాక్లెట్‌ను తీసుకోవడమే ప్రస్తుతం ఆరోగ్యానికి మంచిదని.. కెమికల్స్ వున్న చాక్లెట్లకు దూరంగా వుండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక ‘సెక్స్ స్కాండల్’ బ్రిటన్ ప్రధాని పదవికి ఎలా గండం తెచ్చింది?