Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబుకు మృత్యుభయం.. హెలికాప్టర్ ఎందుకు ఎక్కరో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలిపోయిన తర్వాత ఏపీకి ఆర్థిక లోటు ఉందని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి సమావేశంలో చెబుతూ వస్తున్నారు. ప్రతిపక్షాలు ఏదైనా ఘాటు విమర్శ చేస్

Advertiesment
చంద్రబాబుకు మృత్యుభయం.. హెలికాప్టర్ ఎందుకు ఎక్కరో తెలుసా?
, బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (15:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలిపోయిన తర్వాత ఏపీకి ఆర్థిక లోటు ఉందని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి సమావేశంలో చెబుతూ వస్తున్నారు. ప్రతిపక్షాలు ఏదైనా ఘాటు విమర్శ చేస్తే అసలే లోటు బడ్జెట్‌లో ఉంటే పుండు మీద కారం చల్లినట్లు వైకాపా విమర్శలా అంటూ దెప్పిపొడిచేలా ప్రతి విమర్శలూ చేస్తుంటారు ముఖ్యమంత్రి. ఇది అందరికీ తెలిసిందే. అలాంటి ముఖ్యమంత్రి లోటు బడ్జెట్‌లో ఉన్నప్పుడు ప్రభుత్వ ధనాన్ని ఆచితూచి ఖర్చుపెట్టాలి. అయితే ఈ ముఖ్యమంత్రి మాత్రం అలా కాదు. ఏం చేస్తున్నారో చూడండి.
 
ముఖ్యమంత్రి.. ఈ పదవి గురించి పెద్దగా చెప్పనక్కరలేదు. అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి ఎక్కడైనా కార్యక్రమాలకు వెళ్ళాలన్నా.. తిరిగి సచివాలయానికి రావాలన్నా ఖచ్చితంగా ఏదో ఒక మార్గం అవసరం. అందులోను విఐపిలు మామూలుగా విమానాల్లో తప్ప వేరే వాటిల్లో ఎక్కరు. మరీ ఖర్చు తగ్గించాలంటే హెలికాప్టర్‌లు వాడుతుంటారు. అది కూడా ప్రభుత్వ డబ్బులతోనే. 
 
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్‌లోనే ఎక్కువగా ప్రయాణించేవారు. ఎక్కడ కార్యక్రమం ఉన్నా ఆయన హెలికాప్టర్‌లోనే తిరిగేవారు. కారణం తక్కువ డబ్బును ఖర్చు చేయడం ఆయన అలవాటు కాబట్టి. అయితే హెలికాప్టర్‌లోనే ప్రయాణిస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అప్పట్లో మరణించారు. 
 
వైఎస్ మరణం తర్వాత చంద్రబాబు హెలికాప్టర్‌లు ఎక్కడం మానేశారు. ఎందుకంటే సిగ్నల్ వ్యవస్థ కట్టయితే హెలికాప్టర్ కూలిపోయి జరగరానిది జరిగిపోతుందని భయం. అందుకే బాబుకు ఇప్పటికీ హెలికాప్టర్ అంటే భయం. 2013 సంవత్సరంలోనే ఒకసారి చావు వరకు వెళ్ళివచ్చారు బాబు. అదేనండీ అలిపిరి బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు. అలా జరిగిన తర్వాత ప్రతి విషయంలోను బాబు ఎంతో జాగ్రత్తగా ఉంటూ వస్తున్నారు.
 
అందుకే ప్రత్యేకంగా ఒక విమానయాన సంస్థతో మాట్లాడుకున్న చంద్రబాబు ప్రతినెలా ఆ సంస్థకు చెందిన విమానంలో తిరుగుతూ కావాల్సినంత డబ్బులను ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చేస్తున్నారు. ప్రతినెలా బాబు రూ.2 కోట్లపైగానే ఆ ప్రైవేటు విమాన సంస్థకు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చేస్తున్నారు. మామూలుగా ముఖ్యమంత్రి ఏ విమానంలోనైనా ఎక్కితే ఆ సంస్థ రాయితీ ఇవ్వడంతో పాటు ప్రత్యేక శ్రద్థ తీసుకుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 
 
ఉదాహరణకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి విమానాశ్రయానికి చంద్రబాబు వస్తే ప్రైవేటు విమానాల్లో రాయితీ పోను ఏ 5 నుంచి 6 వేల రూపాయలు ఖర్చవుతుంది. అంతే అదే చంద్రబాబు మాట్లాడుకున్న విమానంలో అయితే ఏకంగా 20 నుంచి 25 లక్షల రూపాయల ఖర్చవుతుంది. ఇంత ఖర్చవుతున్నా బాబు ఏమాత్రం వెనక్కి తగ్గరు. విమానాన్ని వదిలిపెట్టరు. 
 
చంద్రబాబు విమానాల కోసం ఖర్చు చేసే ఇంత మొత్తాన్ని పేద ప్రజలకు కేటాయిస్తే వారి జీవితాలు ఏ విధంగా బాగుపడతాయో చెప్పనవసరం లేదు. ఏపీలో ఇప్పటికే ఎన్నో మారుమూల గ్రామాలు ఉన్నాయి. తినడానికి తిండిలేని గ్రామస్తులు ఉన్నారు. అయినా సరే ప్రభుత్వం మాత్రం ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ప్రతి సమావేశంలో చెప్పుకుని వెళ్ళిపోతున్నారు. బాబు గారు ఒక్కసారి ఆలోచించండి...! 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టపాసుల మోత మోగుతుందనుకుంటే.. తడిసిన తారాజువ్వలా తుస్సుమంది: రాహుల్