Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ ఆశీస్సులతో వెబ్ దునియా @ 18 (video)

వెబ్ దునియా నేటితో... సెప్టెంబరు 23తో 17 ఏళ్లు పూర్తి చేసుకుని 18వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా ప్రారంభించి

Advertiesment
మీ ఆశీస్సులతో వెబ్ దునియా @ 18 (video)
, శనివారం, 23 సెప్టెంబరు 2017 (01:58 IST)
వెబ్ దునియా నేటితో... సెప్టెంబరు 23తో 17 ఏళ్లు పూర్తి చేసుకుని 18వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా ప్రారంభించిన వెబ్ ప్రపంచం తన పేరును వెబ్ దునియా తెలుగుగా మార్చుకుని విజయవంతంగా ముందుకు సాగుతోంది. వెబ్ దునియా స్థాపించిన రోజు సెప్టెంబరు 23, 1999. ఆ రోజుల్లో దేశ వ్యాప్తంగా భాషా పోర్టళ్లను ప్రారంభించిన ఘనత కేవలం వెబ్ దునియాకే దక్కుతుంది. భారతీయ భాషల్లో తొలిసారిగా పోర్టళ్లను ప్రారంభించిన వెబ్ దునియా తన సేవలను విస్తరిస్తూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం తనకంటూ వినియోగదారులను, చందాదారులను కలిగిన వెబ్ దునియా దేశ వ్యాప్తంగా శాఖలను కలిగి సాగుతోంది. 
 
1980ల్లో ఇంటర్నెట్ అంతగా అందుబాటులో లేని కాలంలో బీఎస్ఎన్ఎల్ ఆగస్టు 15, 1995లో ఓ గేట్వే సర్వీసును ప్రారంభించింది. ఆ రోజుల్లో వెబ్ సైట్లనేవి చాలా చాలా తక్కువే. ఉన్నవి కూడా ఆంగ్లంలోనే అగుపిస్తుండేవి. అలాంటి సమయంలో భారతీయ భాషల్లో వెబ్ సైట్లు ప్రారంభించాలన్న సంకల్పంతో వెబ్ దునియా హిందీ ప్రారంభించబడింది. ఇక అప్పటి నుంచి ఒక్కసారి 18 ఏళ్లు వెనక్కి తిరిగి చూస్తే నేడు ప్రపంచవ్యాప్తంగా వెబ్ దునియా ఎంతోమంది వినియోగదారులకు డిఫాల్ట్ వెబ్ సైట్ గా వున్నదని సగర్వంగా చెప్పుకునేందుకు ఆనందంగా వుంది. 
 
తెలుగు భాషా పోర్టళ్లలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వెబ్ దునియా తెలుగును తెలుగు రాష్ట్రాల్లోనే కాక విదేశాల్లో నివాసముంటున్న తెలుగువారు సైతం ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. భారతీయ భాషల్లో వార్తా విశేషాలను అందించాలన్న సంకల్పంతో ఆనాడు వెబ్ దునియా వ్యవస్థాపకులు శ్రీ వినయ్ ఛజ్లాని వేసిన ఆ అడుగు ఇప్పుడు 8 భాషల్లో పోర్టల్ సేవలందిస్తూ తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషలతో పాటు జాతీయ భాష హిందీ ఇంకా మరో మూడు భాషల్లో వీక్షకులకు అందుబాటులో వున్నాయి. 
 
వెబ్ దునియా తన ప్రయాణంలో ఎన్నో శొబగులను సంతరించుకున్నది. వీడియో వార్తలు, వెబ్ ఎడిటోరియల్, సినిమా సమీక్షలు తదితర ఎన్నో సేవలు అందిస్తోంది. వెబ్ రిపోర్టర్‌గా మొబైల్ యాప్ ద్వారా సేవలందించేందుకు వస్తోంది. ఈ సౌకర్యం ద్వారా వీక్షకులు, వినియోగదారులు తమతమ ఐడియాలను, చిత్రాలను, వీడియోలు, ఫోటోలు షేర్ మాకు షేర్ చేయవచ్చు. దీని ద్వారా పోర్టల్-యూజర్లకు ఓ వారధి ఏర్పడినట్లయ్యింది. 
 
లక్షలాది యూజర్లకు, నేడు వెబ్ దునియా వెబ్ సైట్ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం, షేర్ చాట్, యూట్యూబ్ ద్వారా అందుబాటులో వుంది. యూ ట్యూబ్ చానల్‌కి లక్షకు పైగా చందాదారులున్నారు. ఇక్కడ 5000 పైగా వీడియోలున్నాయి. ఇవన్నీ మీ వెన్నుదన్ను, ఆశీర్వాదాలు లేకుండా సాధ్యం కావు. 
 
18వ ఏటలోకి అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలో మీ ఆశీస్సులు, దీవెనలు నిత్యం ఇలాగే కొనసాగిస్తారని కోరుకుంటున్నాము. మా సేవలను మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతామని మనవి చేసుకుంటున్నాము.
-మీ
వెబ్ దునియా బృందం

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వం ఏమిస్తే మీరు అభివృద్ధి చెందుతారు... ప్రజల వద్దకు సీఎం బాబు