Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2022 తెలంగాణ రౌండప్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్.. డొంక కదిల్చింది..

Yadagiri
, మంగళవారం, 27 డిశెంబరు 2022 (14:29 IST)
ఢిల్లీ రాష్ట్రంలో  చోటుచేసుకున్న మద్యం స్కామ్ తెలంగాణను కుదిపేసింది. మద్యం స్కాంలో భాగంగా తెలంగాణ వైపు దర్యాప్తు సంస్థలు తిరిగి చూశాయి. దీంతో హైదరాబాదులో ముడుపులు పట్టుకున్నాయి. ముడుపులు, పర్మిట్ల బాగోతంలో ఏపీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బోయినపల్లి అభిషేక్ రావు తదితరుల పేర్లు ఛార్జీషీటులోకి ఎక్కాయి.  
 
నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ తరపున కొందరు ప్రయత్నించడం ఈ ఏడాది తెలంగాణ రాజకీయాల్లో మరో హైలైట్ గా నిలిచింది. గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి బీజేపీలో చేరితే వందల కోట్లు, కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి రక్షణ ఉంటుందని నిందితులు చెప్పిన ఆడియోలు, వీడియోలు బయటికి రావడంతో బీజేపీ ప్రతిష్ట మసకబారింది. కాకపోతే.. ఈ డీల్ లో బీజేపీ నేతల పేర్లు తప్ప ఆ పార్టీకి ప్రత్యక్ష సంబంధం లేకపోవడం కేసును నీరుగార్చే అంశం. 
 
అలాగే ఈ ఏడాది... తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించిన యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ మార్చిలో పునః ప్రారంభించారు. రెండు వేల కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతం ముచ్చింతల్ లో 66 మీటర్ల ఎత్తుతో భారీ వ్యయంతో నిర్మించిన రామానుచార్య విగ్రహాన్ని (సమతా విగ్రహం) ప్రధాని మోదీ మే నెలలో ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుకు వెయ్యి కోట్ల మేర వ్యయం అయ్యింది.
 
తెలంగాణకు గుడ్ న్యూస్
ఈ ఏడాది తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. గత 8 ఏళ్లలో రాష్ట్రానికి దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడు వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. అమరరాజా బ్యాటరీల కంపెనీ, క్యాపిటల్ ల్యాండ్, జపాన్ కంపెనీ దైపు, అమోలెడ్ ఇండియా వంటి ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెన్షన్లపై ఆరు నెలలకు ఓసారి ఆడిటింగ్ జరగాలి : సీఎం జగన్