Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళుడు మగడ్రా బుజ్జీ... మరి మనం....??????

సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ విషయంలో తామెప్పుడు ముందుంటామని తమిళులు మరోమారు రుజువు చేశారు. తమ సంస్కృతిలో భాగమైన జల్లికట్టును నిషేధాన్ని వ్యతిరేకిస్తూ గత నాలుగు రోజులుగా తమిళులు తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. తమిళుల నిరసన జ్వాలలకు కేంద్రం దిగి వచ్చింది

Advertiesment
Tamil Youth super
, శనివారం, 21 జనవరి 2017 (13:44 IST)
సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ విషయంలో తామెప్పుడు ముందుంటామని తమిళులు మరోమారు రుజువు చేశారు. తమ సంస్కృతిలో భాగమైన జల్లికట్టును నిషేధాన్ని వ్యతిరేకిస్తూ గత నాలుగు రోజులుగా తమిళులు తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. తమిళుల నిరసన జ్వాలలకు కేంద్రం దిగి వచ్చింది. ఈ పోరాటం రాజకీయాలకు అతీతంగా జరగడం విశేషం. నాయకుడు లేకపోయినా యువత తమంతట తామే స్వచ్ఛందగా ముందుకు వచ్చి ఉద్యమంలో భాగస్వాములు కావడం చెప్పుకోదగ్గ విషయం. 
 
సెల్ ఫోన్ వెలుగుల్లోనే రాత్రిపూట కూడా తమ నిరసనలు తెలియజేశారు. ఇదిలావుండగా తమిళ సినీ హీరోలు సైతం ఈ ఉద్యమానికి మద్ధతు తెలిపి సంఘీభావం తెల్పారు. ఉద్యోగులు తమ విధులకు సెలవు పెట్టి మరి ఉద్యమంలో పాల్గొన్నారు. షాపులను వ్యాపారస్తులు స్వచ్ఛందగా మూసివేసి తమ మద్దతును తెల్పారు. తమిళులలో ఉన్న చైతన్యం తెలుగు వారిలో ఉందా? అనేదే ఇక్కడి ప్రశ్న.
 
తమిళులు కేవలం జల్లికట్టు క్రీడ కోసమే సమిష్టిగా రోడ్డెక్కి తమ సత్తా చాటారు. కేంద్రం కొమ్ములు వంచారు. తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకుండా మాట తప్పిన కేంద్రాన్ని గట్టిగా అడగటానికి ఆంధ్రులకు నోరుపెగలడంలేదు. నిరసనలు తెల్పడానికి ఆసక్తి చూపలేదు. ఈ విషయమై అధికార పక్షం - ప్రతిపక్షం - సినీ పరిశ్రమ స్పందించలేదు. కొందరు నాయకులు తమ ప్రత్యేకత చాటుకోవడానికి కొన్ని రోజులు ప్రత్యేక హోదా జపం చేసి మానుకున్నారు. 
 
సంప్రదాయాలకు భంగం కలిగినందుకే తమిళులు పోరు బాట పడితే.... ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం అంటే ఆంధ్రులు చేష్టలుడిగి కూర్చున్నారు. ఉద్యోగం, ఉపాధి కల్పించే ప్రత్యేక హోదా విషయమై స్పందించాల్సిన యువత అది తమకు సంబంధంలేని అంశంగా భావించి మౌనంగా ఉండిపోయారు. తమిళులు మూడు రోజుల్లో కేంద్రాన్ని కదిలించారు. మనం మూడు సంవత్సరాలు అవుతున్నా కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నాం. సంప్రదాయ పోరు తమిళనాట రాజకీయం, సినిమా ఏకమైంది. 
 
ఆంధ్రలో ప్రత్యేక హోదా విషయంలో సినిమా, రాజకీయం రాజీ పడింది. అక్కడ తమిళ యువతరం చేస్తున్న పోరాటం చూసి మన యువత నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కేవలం సోషల్ మీడియాతో ఉద్యమాన్ని ఉప్పెనలా మార్చిన తమిళ యువతరాన్ని అభినందించి తీరాల్సిందే. వీరిని చూసి తెలుగు యువతరం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందుకే తమిళుడు మగడ్రా బుజ్జీ.... మరి మనం....??????????? అనుకోవాల్సి వస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జేఎన్‌యూ విద్యార్థినిపై ఆప్ఘన్ యువకుల రేప్.. టీచర్‌పై హెడ్మాస్టర్ బలాత్కారం