Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేము శవాలై.. పరులకు వశమవుతున్నాం... సెక్స్ వర్కర్ల దీనగాథలు (వీడియో)

సెక్స్ వర్కర్లంటే దేశంలో ప్రతియొక్కరికి చిన్నచూపు ఉంది. వారిని ఏ ఒక్కరు సాటి మనుషులుగా భావించరు. చూడరు. అందుకే సెక్స్ వర్కర్లు.. సమాజంలో హీనమైన జీవితాన్ని గడుపుతున్నారు. జీవితంలో వెలుగులు కరువైన చీకటి

మేము శవాలై.. పరులకు వశమవుతున్నాం... సెక్స్ వర్కర్ల దీనగాథలు (వీడియో)
, శుక్రవారం, 28 అక్టోబరు 2016 (14:03 IST)
సెక్స్ వర్కర్లంటే దేశంలో ప్రతియొక్కరికి చిన్నచూపు ఉంది. వారిని ఏ ఒక్కరు సాటి మనుషులుగా భావించరు. చూడరు. అందుకే సెక్స్ వర్కర్లు.. సమాజంలో హీనమైన జీవితాన్ని గడుపుతున్నారు. జీవితంలో వెలుగులు కరువైన చీకటి బతుకులవి. అతికొద్ది మంది తప్ప.. ఎవరూ కావాలని సెక్స్‌వర్కర్లుగా మారాలను కోరుకోరు. ఈ నిశీధి పద్మవ్యూహంలోకి అతివలలను లాక్కొచ్చే కారణాలెన్నో. పేదరికం ఓ కారణం కాగా, పొట్ట నింపుకోవడానికి ఈ ఊబిలో దిగేవారు. జీవితంలో మోసానికి గురై.. వేరే దారిలేక ఇందులో చిక్కుకుపోయేవారు మరికొందరు. 
 
ఏ కారణాలతో అయితే ఈ దందాలో అడుగుపెడుతున్నారో.. ఒక్కసారి ఈ రొంపిలో దిగాక.. ఇక సాధారణ జీవితం గడపే అవకాశం ఏ కొంత మందికోకానీ రాదు. పొట్టకూటి కోసం తానొక శవమై.. పరులకు వశమై, ఈ వ్యభిచార వృత్తిలో ఎంతో మంది మహిళలు తమ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. వారి జీవితం ఎప్పుడూ ఎడారై.. ఎందరికో ఒయాసిస్‌లా అంతమౌతోంది. జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగిపోతున్న అభాగ్య జీవుల గుండెచప్పుళ్లు అన్నీఇన్నీ కావు. 
 
హృదయం ఉంటే కన్నీరు కూడా సలసల కాగే విషాధం వీరిది. సెక్స్ వర్కర్ల జీవితంపై ఆ మధ్య నిర్వహించిన ఓ సమావేశంలో వీరంతా తమ జీవిత గాథలను పంచుకున్నారు. కామాంధుల ఆకలిని తీర్చేదారుణ వృత్తిలోకి వచ్చిన వీళ్ల మాటలు వింటే గుండేఝల్లుమంటుంది. ఈ వృత్తిలో ఉన్న ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. ఈ వృత్తిలోంచి బయటకు వచ్చి కష్టపడి పనిచేసుకుని బతకడానికి సిద్ధంగా ఉన్నా... వారిని సాటి మనుషులుగా ఎవరూ చూడటం లేదు. నీచంగా చూస్తున్నారు. వీలైనన్ని విధాలుగా అవమానిస్తారు. ఈ వీడియోలో వారి మాటలు వింటే మనసున్న ప్రతి ఒక్కరి హృదయం కన్నీటితో బరువెక్కుతుంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి పార్టీ ఏమైందో తెలుసుగా... పవన్ కళ్యాణ్‌ది ఉడుకు రక్తం.. టైం పట్టొచ్చు