Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వామి సేవకు మళ్లీ శేఖర్ రెడ్డి... లెక్క 35 మంది, ఇక సామాన్య భక్తుడు రానక్కర్లేదేమో?

Advertiesment
Sekhar Reddy
, గురువారం, 19 సెప్టెంబరు 2019 (22:34 IST)
టిటిడి ధర్మకర్తల మండలిలో శేఖర్‌ను స్పెషల్ ఇన్వైటీగా తిరిగి నియమించారు. తమిళనాడు తరఫున శేఖర్ స్పెషల్ ఇన్వైటీగా తిరిగి నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిఓ కూడా విడుదల అయిపోయింది. అక్రమ మనీలాండరింగ్ కేసులో సిబిఐ చేతిలో అరెస్టయ్యారు శేఖర్. దీంతో గతంలో శేఖర్‌ను పాలక మండలి సభ్యునిగా తొలగించారు. 
 
మళ్ళీ ఆయన శ్రీవారి సేవలో స్పెషల్ ఇన్వైటీగా రావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. స్వామి తనకు సేవ చేసుకునే అవకాశం మరోసారి ఇచ్చారంటూ తెగ సంతోషపడి పోతున్నారు శేఖర్.
 
 మరోవైపు అత్యంత ఆదరణ కలిగిన ఏకైక హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానములు తాజాగా జగన్మోహన్ రెడ్డి  తీసుకున్న 35 ధర్మకర్తల మండలి సభ్యుల నియామకంతో రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి.
 
భారీ కేబినెట్‌ను తలపించేలా తితిదే బోర్డ్
గతంలో కేవలం ధార్మిక కార్యక్రమాలు టీటీడీ ద్వారా చేపట్టే హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు, పరిపాలన నిర్వహణ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ధర్మకర్తల నియామకం జరిగేది. తాజాగా ప్రత్యేక ఆహ్వానితులతో కలిపి 35 మందితో అతిపెద్ద జంబో పాలకమండలి ఏర్పాటు చూసి భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 
 
35 మంది సభ్యులకు ప్రోటోకాల్ కోటా కింద సేవ చేయాలనుకుంటే టిటిడి నిధులు పూర్తిగా భక్తుల సేవకు కాకుండా పాలకమండలి సభ్యులు సేవకే సరిపోతుందనే విమర్శలు కూడా చేస్తున్నారు.
webdunia
 
 విచక్షణ కోటా కింద 35 మంది సభ్యులకు దర్శనాలు, అకామిడేషన్‌లో ప్రత్యేకమైన కోటా ఇస్తూ పోతే సామాన్యుడు ఇకపై తిరుమలకు రానక్కరలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అత్యంత వివాదాస్పదం అవుతోంది.
 
కేవలం ధార్మిక భావన కలిగి వెంకటేశ్వర స్వామి మీద భక్తితో సేవ చేసే తలంపుతో నియామకం జరిగేది. కానీ ఇప్పుడు అసంతృప్తులకు, రాజకీయ విస్తృత ప్రయోజనాల కోసం దేశంలోని అనేక ప్రాంతాల నుంచి చోటు కల్పించడం ద్వారా 35 మందితో టీటీడీని ఏంచేయబోతున్నారంటూ హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. దీనిని పునఃసమీక్షించుకోవాలని లేకుంటే న్యాయపోరాటం చేసేందుకు హిందూ ధార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పాకిస్తాన్ నుంచి ఎవరైనా కశ్మీర్‌కు వెళ్ళి జిహాద్ చేస్తే కశ్మీరీలే నష్టపోతారు' - ఇమ్రాన్ ఖాన్