పన్నీరు కొంప ముంచిన భాజపా, శశికళను నమ్ముకుని వుంటే పన్నీరే కింగా?
డ్యామిడ్... కథ అడ్డం తిరిగింది. ఒక్కొక్కప్పుడు ప్రజలంతా మాకొద్దు బాబోయ్ అంటున్నా ఇష్టం లేని నాయకుడు లేదా నాయకురాలు పీఠాలపై కూర్చుంటారు. పార్టీకి ఓటు వేసి గెలిపించినందుకు చెంపలు వాయించుకుంటూ వారి పాలనలో ప్రజలు ఐదేళ్లపాటు బతుకీడుస్తారు. ఇప్పుడు తమిళనాడ
డ్యామిడ్... కథ అడ్డం తిరిగింది. ఒక్కొక్కప్పుడు ప్రజలంతా మాకొద్దు బాబోయ్ అంటున్నా ఇష్టం లేని నాయకుడు లేదా నాయకురాలు పీఠాలపై కూర్చుంటారు. పార్టీకి ఓటు వేసి గెలిపించినందుకు చెంపలు వాయించుకుంటూ వారి పాలనలో ప్రజలు ఐదేళ్లపాటు బతుకీడుస్తారు. ఇప్పుడు తమిళనాడులో పరిస్థితి అలాగే వుందంటున్నారు.
ఇకపోతే శశికళను ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు రాజీనామా పత్రాన్ని గవర్నర్ చేతులకు అందించిన పన్నీర్ సెల్వం ఆ తర్వాత భాజపా కనుసన్నల్లో నడుచుకున్నారనే విమర్శలున్నాయి. శశికళ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో ఆయనకు ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి, సినీ సెలెబ్రిటీల నుంచి పెద్దఎత్తున మద్దతు కూడా వచ్చింది. ఐతే ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యేలు మాత్రం పన్నీర్ సెల్వం వైపు లేరు.
అంతా గోల్డెన్ బే రిసార్టుకే పరిమితమైపోయారు. శశికళ ఎంత చెబితే అంత అన్నట్లు అక్కడే అతుక్కుపోయారు. ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడంలో పన్నీర్ ఘోరంగా విఫలమయ్యారు. పన్నీర్ పైన నమ్మకం వుంచి వెన్నుదన్నుగా నిలిచిన భాజపాకు శశికళ ఒక రకంగా చుక్కులు చూపించింది. జైలుకు వెళుతూ తన లెక్కను పూర్తిగా అమలుచేసి మరీ వెళ్లిపోయింది.
ఏతావాతా చూస్తే పన్నీర్ సెల్వం నిండా మునిగిపోయారు. ఎలాగంటే... శశికళ చెప్పినట్లు రాజీనామా చేసి మిన్నకుండా వున్నట్లయితే ఆయనకు మంత్రి పదవి ఖచ్చితంగా దక్కి వుండేది. అలాగే... ఇప్పుడు శశికళ జైలుకు వెళ్లింది కనుక ఆమె మళ్లీ పన్నీర్ సెల్వంనే పార్ట్ టైం సీఎంగా అపాయింట్ చేసి వుండేది. అలా చూసినప్పుడు పన్నీర్ సెల్వం లక్కీ ఛాన్స్ మిస్సయ్యారంటున్నారు. భాజపా మాయలో పడి అంతా పోగొట్టుకుని చివరకు పార్టీ నుంచి వేటు కూడా వేయించుకుని ఒంటరిగా మిగిలిపోయారు. ఏం చేస్తాం... రాజకీయాల్లో ఏదయినా సాధ్యమే మరి.