Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2019 ఎన్నికలే టార్గెట్.. రజనీని బుజ్జగించే పనుల్లో బీజేపీ? వెయిట్ అండ్ వాచ్ అంటోన్న అమిత్ షా

పీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తమిళనాడు రాజకీయాలపై స్పందించాడు. అన్నాడీఎంకే నుంచి వెలివేయబడిన పన్నీర్ సెల్వం.. బీజేపీలో చేరుతారనే వార్తలను కొట్టిపారేసిన అమిత్ షా.. బీజేపీ రాష్ట్రంలో నాటుకుపోయేందుకు చర్య

2019 ఎన్నికలే టార్గెట్.. రజనీని బుజ్జగించే పనుల్లో బీజేపీ? వెయిట్ అండ్ వాచ్ అంటోన్న అమిత్ షా
, గురువారం, 16 ఫిబ్రవరి 2017 (15:56 IST)
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తమిళనాడు రాజకీయాలపై స్పందించాడు. అన్నాడీఎంకే నుంచి వెలివేయబడిన పన్నీర్ సెల్వం..  బీజేపీలో చేరుతారనే వార్తలను కొట్టిపారేసిన అమిత్ షా.. బీజేపీ రాష్ట్రంలో నాటుకుపోయేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పరోక్షంగా చెప్పారు.  ఏం జరుగుతుందోనని వేచి చూస్తూనే అర్థమవుతుందని చెప్పారు.

అన్నాడీఎంకేలో చీలిక, శశికళ జైలుకు వెళ్లడం.. పన్నీర్ వెలివేయబడటం.. పళని ప్రమాణ స్వీకారం వంటి చర్యలతో విసిగిపోయిన తమిళ ప్రజలు కొత్త నాయకుడొస్తే బాగుంటుందనుకుంటున్నారు. దీన్ని క్యాష్ చేసుకునే దిశగా బీజేపీ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను బుజ్జగించే పనుల్లో ఉంది. అయితే రజనీ కాంత్ మాత్రం రాజకీయాల్లో రానని తేల్చి చెప్పేస్తున్నారు. 
 
ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా రజనీని రాజకీయాలకు దూరంగా ఉండాల్సిందిగా చెప్పారు. దీంతో రజనీ మాత్రం రాజకీయాల్లోకి వచ్చేది లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రజనీని ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి తేవడం కుదరదు. అందుకే 2019 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. అంతలోపు రజనీని బుజ్జగించి.. బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించేయాలని భావిస్తోంది. అన్నాడీఎంకేలో ప్రజాదరణ నేత లేకపోవడంతో పాటు.. డీఎంకేకు అవకాశాలున్నా.. మంచి క్రేజున్న నేత రజనీకాంత్‌ను బరిలోకి దించితే తప్పకుండా తమిళనాట తమదే విజయం అవుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. 
 
దీనిపై ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా స్పందిస్తూ.. అన్నాడీఎంకే పార్టీ విషయాల్లో తలదూర్చం.. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. పన్నీర్ సెల్వం తన పని తాను చేసుకుపోతున్నాడు.. అలాగే బీజేపీ కూడా తమ పార్టీ మేలుకు అనుగుణంగా కార్యచరణ చేస్తుందన్నారు. తమిళనాడు రాజకీయాలపై ఇప్పుడే ఏదీ చెప్పనని.. జరిగేదేదో వేచి చూడాల్సిందేనని నవ్వుకుంటూ హింట్ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూరలో కారం ఎక్కువైందని భార్యను చంపిన భర్త.. అక్రమ అఫైర్‌కు తల్లి అడ్డు.. చంపి ఐదు రోజులు?