Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పన్నీర్ వర్గ ఎమ్మెల్యేలపై వేటు వేస్తే.. శశికళ పదవికి కూడా ముప్పే

తమిళనాడు రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత సంక్షోభం, ఆధిపత్య పోరు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన మాజీ ముఖ్యమంత్రి పన్నీ

పన్నీర్ వర్గ ఎమ్మెల్యేలపై వేటు వేస్తే.. శశికళ పదవికి కూడా ముప్పే
, సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (14:30 IST)
తమిళనాడు రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత సంక్షోభం, ఆధిపత్య పోరు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సిద్ధమవుతున్నారు. ఇందుకోసం జైలు నుంచే మౌఖిక ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. మరోవైపు.. పన్నీర్ కూడా అలాంటి చర్యల కోసమే ఎదురు చూస్తోంది. 
 
ఈనెల 7వ రాత్రి దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం అన్నాడీఎంకే అధిష్టాన వర్గంపై తిరుగుబాటు చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయనకు మాజీమంత్రి మాఫాయ్‌ పాండ్యరాజన్ సహా 10 ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. 15న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు బదులుగా ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎడప్పాడి కె.పళనిసామిని ఎంపిక చేశారు. ఈనెల 16న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. బలపరీక్షకు గవర్నర్‌ 15 రోజులు గడువుచ్చినా ఎడప్పాడి పళనిసామి శనివారమే అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొన్నారు. 
 
ఈ విశ్వాస పరీక్ష కోసం ఆ పార్టీ విప్ రాజేంద్రన్ అన్నాడీఎంకే శాసనసభ్యులంతా ప్రభుత్వానికి మద్దతుగా ఓటేయాలని విప్‌ జారీ చేశారు. కానీ, శనివారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షా సమయంలో 88 డీఎంకే సభ్యులను గెంటివేశారు. ఈ చర్యకు నిరసనగా కాంగ్రెస్, ఐఎంయుఎల్‌ సభ నుంచి వాకౌట్ చేశాయి. 
 
చివరకు ఆసమయంలో సభలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం సహా 11 మంది శాసనసభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే విప్‌ రాజేంద్రన్ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సహా 11 మంది శాసనసభ్యులను పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పదవుల నుంచి తొలగించేందుకు తగు చర్యలు చేపట్టనున్నారు. 
 
అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం తమను అనర్హులుగా ప్రకటించే అధికారం శశికళ నాయకత్వంలోని పార్టీకి లేదని, శశికళ నియామకమే పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వారి తరపున జారీ అయిన విప్‌ తమ వర్గానికి వర్తించదని పన్నీర్‌ సెల్వం వర్గ వాదిస్తోంది. 
 
ఏది ఏమైనప్పటికీ తమకు బద్దశత్రువైన పన్నీర్‌సెల్వంపై కక్ష తీర్చుకునేందుకు ఇదే అనువైన సమయమని అధికార అన్నాడీఎంకే పార్టీ నాయకులు భావిస్తున్నారు. పన్నీర్‌ వర్గీయులైతే తమపై అనర్హత వేటు పడితే కోర్టుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, అదే జరిగితే శశికళ పదవి కోల్పోతుందని, తద్వారా శశికళకు చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుద్ధి లేక టీడీపీలో చేరానంటూ ఆనం కన్నీరు... తెదేపాకు షంటింగ్ మొదలైనట్టేనా?