Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బుద్ధి లేక టీడీపీలో చేరానంటూ ఆనం కన్నీరు... తెదేపాకు షంటింగ్ మొదలైనట్టేనా?

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటలో టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినా టీడీపీ అధిష్టానం నుంచి సరైన హామీ రాకపోవడంతో ఆనం వివేకానందరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా టీడీపీలో చేరామని అనచరుల వద్ద ఆవే

బుద్ధి లేక టీడీపీలో చేరానంటూ ఆనం కన్నీరు... తెదేపాకు షంటింగ్ మొదలైనట్టేనా?
హైదరాబాద్ , సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (14:10 IST)
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటలో టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినా టీడీపీ అధిష్టానం నుంచి సరైన హామీ రాకపోవడంతో ఆనం వివేకానందరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా టీడీపీలో చేరామని అనచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.  కాంగ్రెస్‌ పార్టీలో తాము చెప్పిందే వేదం..తాము చెప్పిన వారికే పదవులు అన్న విధంగా ఏలిన ఆనం కుటుంబానికి తెలుగుదేశం పార్టీలో చేదు అనుభవం ఎదురైంది.  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్‌ కోసం తనను కలిసిన ఆనం సోదరులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నమ్మకంతో పార్టీలోకి ఆహ్వానిస్తే, పార్టీకి  నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని సీఎం మండిపడినట్లు తెలిసింది. 
 
పార్టీలోకి ఆహ్వానించే ముందు ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ సీటు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆనం సోదరులు టీడీపీలో చేరి చక్రం తిప్పుదామని ముందుగానే వ్యూహరచన చేశారు. రామనారాయణరెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే టికెట్‌ , వివేకా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ సీటు, తనయుడు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించారు. బాబు ఆగ్రహంతో ఆనం సోదరుల ముందస్తు వ్యూహాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.  
 
ఎమ్మెల్సీ సీటు కోసం ఆనం వివేకాందరెడ్డి స్వయంగా వెళ్లి సీఎంను కలిశారు. అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోయినా రెండు రోజులు విజయవాడలో బస చేసి చివరికి 2 నిమిషాలు మాట్లాడే అవకాశం దక్కించుకున్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే చంద్రబాబునాయుడు ఇప్పటికే రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌చార్జిగా అవకాశం కల్పించామని, ఇంకా ఏమి ఇవ్వాలో తెలుసునని, అడగాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పినట్లు తెలిసింది. భంగపడ్డ ఆనం టీడీపీలో చేరి తప్పుచేశానని అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
 
తనకు ఎమ్మెల్సీ స్థానం..తన కుమారుడికి నగర ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించి ఆనం  టీడీపీలో చేరారు. తన అనుచరులకు రానున్న రోజుల్లో టీడీపీని మనమే లీడ్‌ చేస్తామని చెప్పారు. అమరావతి మూడ్రోజుల పర్యటనతో ఆనం అంచనాలు తలకిందులయ్యాయి. కాంగ్రెస్‌ని ఏ విధంగా లీడ్‌ చేశామో.. అలాగే టీడీపీని లీడ్‌ చేయవచ్చని  వివేకా అనుకున్నారు. అయితే  లోకేష్‌  మీ పని మీరు చూసుకోవాలని, మేయర్‌ జోలికి వెళ్లద్దని సూచించడం.. బాబు సైతం పార్టీలో విభేదాలకు కేంద్ర బిందువుగా మారవద్దని హెచ్చరించడంతో వివేకా మనస్తాపానికి గురైనట్లు సమాచారం. తర్వాత మీడియాతో మాట్లాడుతూ తమ సొదరుల మధ్యన చిచ్చుపెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్‌ను వదిలేసిన ఆ ఇద్దరు... ఆ భయంతో పవన్ వణుకు?