Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేటీఆర్‌ను ఫాలో అవుతున్న చినబాబు... ఎందుకు..!

ఏపీ రాష్ట్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నారా లోకేష్‌ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారట. తనకు తానే సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్న లోకేష్‌ వాటిని తూ.చా తప్పకుండా పాటించాలని నిర్ణయించుకున్నారట.

Advertiesment
Nara lokesh
, బుధవారం, 12 ఏప్రియల్ 2017 (13:20 IST)
ఏపీ రాష్ట్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నారా లోకేష్‌ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారట. తనకు తానే సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్న లోకేష్‌ వాటిని తూ.చా తప్పకుండా పాటించాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటివరకు ఉన్నది ఒక ఎత్తు.. మంత్రి అయిన తర్వాత వ్యవహరించాల్సిన తీరు మరో ఎత్తు అన్నది ఆయన భావన. అందుకే ఎక్కడా కూడా విమర్శలకు తావు లేకుండా ప్రధానంగా ప్రతిపక్షం నోట్లో నుంచి విమర్శలు రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నదే లోకేష్‌ ఆలోచనట. అందుకే లోకేష్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలెందుకు లోకేష్‌ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.
 
తెలంగాణాలో కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌కు ఏ విధంగా అయితే ఐటీ శాఖను అప్పగించారో అదేవిధంగా నారా లోకేష్‌కు బాబు ఐటీని అప్పగించారు. ఇప్పటికే ఐటీ శాఖపై పట్టు సాధించిన కేటీఆర్ విదేశాల్లో పర్యటిస్తూ కొత్త పరిశ్రమలను తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీంతో కేటీఆర్‌ను ఫాలో అయిపోతున్నారు లోకేష్‌. కేటీఆర్ ఏవిధంగా అయితే విదేశాల్లో పర్యటించి కొత్త పరిశ్రమల కోసం పెట్టుబడులు పెట్టే వారిని ఆకర్షించి తెలంగాణాకు తీసుకొస్తున్నారో అదేవిధంగా తాను ముందుకెళ్ళాలన్నది లోకేష్‌ ఆలోచనగా ఉందట. 
 
అందుకే ప్రతిపక్షాల నోట్లో విమర్శలు రాకుండా ఐటీ శాఖపై పట్టుసాధించేందుకు ప్రయత్నం చేస్తున్నాడట. ఎలాంటి విమర్శలు చేయకుండా శాఖపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేంతవరకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో సరిపుచ్చుకోవాలన్నదే నారా లోకేష్‌ ఆలోచనట. మరి లోకేష్‌ అనుకున్నది చేసినా ప్రతిపక్షాలు సైలెంట్ ఉంటాయన్నది మాత్రం అనుమానమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో నకిలీ మద్యం - మామూళ్ళ మత్తులో ఎక్సైజ్ శాఖ