Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతిలో నకిలీ మద్యం - మామూళ్ళ మత్తులో ఎక్సైజ్ శాఖ

ప్రభుత్వ నిబంధనలకు ఎక్పైజ్ అధికారులు తూట్లు పొడుస్తున్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో విచ్చలవిడిగా మద్యాన్ని విక్రయిస్తున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ళ మత్తులో తూగుతూ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహ

తిరుపతిలో నకిలీ మద్యం - మామూళ్ళ మత్తులో ఎక్సైజ్ శాఖ
, బుధవారం, 12 ఏప్రియల్ 2017 (13:14 IST)
ప్రభుత్వ నిబంధనలకు ఎక్పైజ్ అధికారులు తూట్లు పొడుస్తున్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో విచ్చలవిడిగా మద్యాన్ని విక్రయిస్తున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ళ మత్తులో తూగుతూ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కల్తీలు జరుగుతున్నా మొక్కుబడిగా దాడులు చేస్తూ మామూళ్ళను పిండుకుంటున్నారు.  
 
నూతన రాష్ట్రంలో మద్యం విక్రయాలపై రాష్ట్రప్రభుత్వం పలు నియమనిబంధనలను ప్రవేశపెట్టింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మద్యం విక్రయాలకు అనుమతులుండగా వాటిని ఏ ఒక్క దుకాణాదారుడు పాటించడం లేదు. తిరుపతి నగరంలో 40 మద్యం దుకాణాలు, 8 బార్లు ఉండగా వాటి నుంచి ఎక్సైజ్ శాఖ, అర్బన్ జిల్లా పోలీసులు మామూళ్ళకు అలవాటు పడి ప్రభుత్వ నియమ నిబంధనలను అమలు చేయడం లేదు.  
 
యథేచ్ఛగా మద్యం దుకాణాలలో కల్తీ జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి అర్బన్ పరిధిలోని 25కిపైగా దుకాణాలలో మద్యం కల్తీ జరుగుతోందని ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. అయినా వాటిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల లీలామహల్ సమీపంలోని మద్దిమానుల వద్ద గల ఒక దుకాణంలో కర్ణాటక రాష్ట్రం నుంచి అతి తక్కువగా తీసుకువచ్చిన మద్యంను బ్రాండెడ్ కంపెనీలలో కలుపుతుండడాన్ని అధికారులు గుర్తించారు. 
 
ప్రతినెలా ఒక్కో మద్యం దుకాణం నుంచి 2వేల రూపాయలకుపైగా లంచాలను ఎక్సైజ్ శాఖ అధికారులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. కల్తీ మద్యంకు ప్రజల ప్రాణాలు బలిగాక ముందే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దినకరన్ చేష్టలు భరించలేం... పన్నీర్ వర్గంలోకి దూకుదాం... అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అంతర్మథనం!