Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టాలిన్ ఎత్తుకు పైఎత్తులు.. ఏంటది...?

తమిళనాడులో రోజుకో విధంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రతిపక్ష డిఎంకే పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. శశికళ జైలుకు వెళ్ళిన తరువాత అన్నాడిఎంకే పార్టీకి అస్సలు దిక్కులేదనుకుంటున్న తరుణంలో పళణి

Advertiesment
MK Stalin
, ఆదివారం, 23 జులై 2017 (15:27 IST)
తమిళనాడులో రోజుకో విధంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రతిపక్ష డిఎంకే పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. శశికళ జైలుకు వెళ్ళిన తరువాత అన్నాడిఎంకే పార్టీకి అస్సలు దిక్కులేదనుకుంటున్న తరుణంలో పళణిస్వామి తెరపైకి వచ్చి అవిశ్వాసంలో నెగ్గి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయితే ప్రభుత్వం ఏ క్షణంలోనైనా పడిపోయే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఇదంతా జరుగుతుండగానే సినీప్రముఖులు రాజకీయాల్లోకి రావడం చర్చకు దారి తీసింది. మొదట్లో రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని, ఆయనే సొంత పార్టీ పెడతారని ప్రచారం జరిగింది.
 
రజినీ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరగడంతో ఆయనే స్వయంగా తన అభిమానులతో నాలుగు రోజుల పాటు సమావేశమై ఒక చర్చలు కూడా జరిపారు. అంతటితో ఆగలేదు దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానని చెప్పుకొచ్చాడు. ఇదంతా అభిమానులకు సంతోషానిచ్చినా ఆ తరువాత రజినీ రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడలేదు. కేవలం కుటుంబ సభ్యులతో మాత్రం చర్చలు జరిపారు. కానీ రజినీ అప్పట్లో చేసిన ప్రసంగంలో డిఎంకే నేత స్టాలిన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. స్టాలిన్ సమర్థవంతుడైన నాయకుడున్నారు. అది కాస్త స్టాలిన్‌ను ఎంతగానో ఆనందాన్ని ఇచ్చింది.
 
స్టాలిన్‌నే కాదు డిఎంకే పార్టీనేతలందరినీ. రజినీ ఆ మాట చెప్పిన వెంటనే స్టాలిన్ కూడా రజినీకి ధన్యవాదాలు తెలిపారు. రజినీ-స్టాలిన్ ఇద్దరి మాటలు విన్న తమిళ ప్రజలు రజినీ పార్టీ పెడితే డిఎంకే‌ను అందులో కలిపేయడం ఖాయమనుకుని భావించారు. అయితే రజినీ పార్టీ పెట్టలేదు.. ఆ తర్వాత ఆలస్యమవుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం మరో నటుడు కమల్ హాసన్ మాత్రం పార్టీ పెట్టడం దాదాపు ఖాయంగా మారింది. 
 
దీంతో కమల్ హాసన్‌ను దగ్గరై జతకడితే తమిళనాడు రాజకీయాల్లో మళ్ళీ డిఎంకేను అధికారంలోకి తీసుకురావచ్చన్నది స్టాలిన్ ఆలోచన. అందుకే ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ స్టాలిన్ పావులు కదుపుతున్నారట. మరో రెండురోజుల్లో కమల్ ను స్టాలిన్ కలవనున్నట్లు ఆ పార్టీ నేతలే 
 
చెబుతున్నారు. మొత్తం మీద ప్రతిపక్ష పార్టీ డిఎంకే అవకాశాలన్ని వాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశ్మీర్‌పై పిచ్చి వేషాలు వద్దు.. పాక్‌కు వెంకయ్య వార్నింగ్