కాశ్మీర్‌పై పిచ్చి వేషాలు వద్దు.. పాక్‌కు వెంకయ్య వార్నింగ్
భారత్ అంటే కాశ్మీర్ అని.. కాశ్మీర్ అంటే భారత్ అని, భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగమని, ఈ విషయంలో పాకిస్థాన్‌లో పిచ్చి వేషాలు వేయొద్దని పాకిస్థాన్ పాలకులకు కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి
భారత్ అంటే కాశ్మీర్ అని.. కాశ్మీర్ అంటే భారత్ అని, భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగమని, ఈ విషయంలో పాకిస్థాన్‌లో పిచ్చి వేషాలు వేయొద్దని పాకిస్థాన్ పాలకులకు కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు హెచ్చరించారు. ఢిల్లీలో ప్రతి ఏటా కార్గిల్ అమరవీరుల స్మారకార్థం నిర్వహిస్తున్న కార్గిల్ పరాక్రమ్ పరేడ్‌లో పాల్గొన్న వెంకయ్య మాట్లాడుతూ... 1971లో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు.
ఉగ్రవాదులకు మద్దతివ్వడాన్ని ఆపేయాలని ఆయన పాక్‌కు స్పష్టంచేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశాల జాబితాలో పాకిస్థాన్‌ను కూడా అమెరికా చేర్చింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబాలాంటి ఉగ్రవాద సంస్థలు పాక్‌లోనే శిక్షణ పొందుతున్నాయని, అక్కడి నుంచే నిధులు సమీకరిస్తున్నాయని అమెరికా గుర్తించినట్లు వెంకయ్య తెలిపారు.
పొరుగు దేశాలకు విశ్రాంతి లేకుండా చేయాలని పాక్ భావిస్తోంది. కానీ ఆ దేశం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ అంతా ఏకమై ఉంది. ఎలాంటి చర్యలనైనా తిప్పికొడతాం. 1971లో ఏం జరిగిందో పాక్ గుర్తుంచుకోవాలి అని వెంకయ్య అన్నారు. 1971లో జరిగిన 13 రోజుల యుద్ధంలో పాక్ ఘోరంగా ఓడిపోయిందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన సూచించారు.