Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేఘాలయా సీఎం సంగ్మాకు అపుడే షాక్.. హెచ్ఎస్‌పీడీపీ తిరకాసు

మేఘాలయా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొన్ని గంటలు కూడా కాకముందే సీఎం కాన్‌రాడ్ సంగ్మాకు మిత్రపక్షమైన హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (హెచ్‌ఎస్‌డీపీపీ) తేరుకోలేని షాకిచ్చింది. దీంతో ఆ పార్టీ నేత

మేఘాలయా సీఎం సంగ్మాకు అపుడే షాక్.. హెచ్ఎస్‌పీడీపీ తిరకాసు
, మంగళవారం, 6 మార్చి 2018 (12:09 IST)
మేఘాలయా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొన్ని గంటలు కూడా కాకముందే సీఎం కాన్‌రాడ్ సంగ్మాకు మిత్రపక్షమైన హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (హెచ్‌ఎస్‌డీపీపీ) తేరుకోలేని షాకిచ్చింది. దీంతో ఆ పార్టీ నేతలను బుజ్జగించే పనుల్లో ముఖ్యమంత్రి సంగ్మా నిమగ్నమైవున్నారు. 
 
నిజానికి ఇటీవల వెల్లడైన ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో 21 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు మరో 9 స్థానాలు కావాల్సి ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు మొగ్గు చూపలేదు. 
 
అదేసమయంలో లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కుమారుడు కాన్‌రాడ్ సంగ్మా సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్.పి.పి) 19 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ పార్టీకి 2 సీట్లలో విజయం సాధించిన బీజేపీతో పాటు యూడీపీకి (6), పీడీఎఫ్‌ (4), హెచ్‌ఎస్‌డీపీపీ (2)తోపాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నారు. దీంతో మొత్తం సంఖ్య 34కు చేరుకుంది. 
 
అయితే, ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని యూడీపీ నేతలు ప్రకటించారు. ఇపుడు సంగ్మా సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వంలో బీజేపీని చేర్చుకోవడాన్ని హెచ్‌ఎస్‌డీపీపీతో పాటు యూడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేక మరింత పెరిగి... ఈ రెండు పార్టీలు కాన్‌రాడ్ సర్కారుకు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటే మేఘాలయా సర్కారు కూలిపోవడం ఖాయంగా తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్‌కు షాక్.. మేఘాలయా ముఖ్యమంత్రిగా సంగ్మా కుమారుడు