కాంగ్రెస్‌కు షాక్.. మేఘాలయా ముఖ్యమంత్రిగా సంగ్మా కుమారుడు
మేఘాలయా రాష్ట్ర ముఖ్యమంత్రిగా లోక్‌సభ మాజీ స్వీకర్ పీఏ సంగ్మా కుమారుడు కాన్‌రడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు.. మరికొందరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
మేఘాలయా రాష్ట్ర ముఖ్యమంత్రిగా లోక్‌సభ మాజీ స్వీకర్ పీఏ సంగ్మా కుమారుడు కాన్‌రడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు.. మరికొందరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరై, కొత్త సీఎం, మంత్రులకు అభినందనలు తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే కేవలం మనుగడ కొనసాగిస్తుందన్న వాదన గతంలో ఉండేది. అయితే ఆ అభిప్రాయాన్ని ఇప్పుడు బీజేపీ మార్చేసిందన్నారు. ఎన్‌పీపీ పార్టీకి చెందిన కాన్‌రడ్ సంగ్మాకు శనివారం వెల్లడైన ఫలితాల్లో 19 సీట్లు గెలుచుకున్నారు. బీజేపీ పొత్తు పెట్టుకొని ఆయన ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి 21 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది.