Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పొన్.రాధాకృష్ణన్‌తో కమల్ భేటీ.. రజనీకి తర్వాత గాలం.. కమల్ హాసన్ బీజేపీలో చేరుతారా?

తమిళనాట దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు బాగానే కనిపిస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అమ్మ మరణానికి తర్వాత ఆమె లాంటి నాయకత్వ లక్షణాలతో కూడిన ఓ వ్యక్తి రాజకీయాల్లో వస్తే బాగుంటుందని అందరూ భావిస్

పొన్.రాధాకృష్ణన్‌తో కమల్ భేటీ.. రజనీకి తర్వాత గాలం.. కమల్ హాసన్ బీజేపీలో చేరుతారా?
, బుధవారం, 25 జనవరి 2017 (13:40 IST)
తమిళనాట దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు బాగానే కనిపిస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అమ్మ మరణానికి తర్వాత ఆమె లాంటి నాయకత్వ లక్షణాలతో కూడిన ఓ వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో సినీ తారలపై ప్రజల మనస్సు మళ్లింది. ఇప్పటికే అజిత్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేయడం జరిగిపోయింది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తన కమలంతో తమిళనాట నాటుకుపోవాలని రంగం సిద్ధం చేస్తోంది. గతంలో తమిళ సూపర్ స్టార్, కబాలి హీరో రజనీకాంత్‌కు గాలం వేసిన బీజేపీ ప్రస్తుతం కమల్ హాసన్‌ను టార్గెట్ చేసింది. బీజేపీకి మద్దతిచ్చేందుకు గతంలో రజనీకాంత్ సున్నితంగా తిరస్కరించారనే వార్తలు వినబడ్డాయి. ప్రస్తుతం కమల్ హాసన్ కూడా అదే పనిచేశారని తమిళ మీడియా కోడైకూస్తోంది. 
 
ఇంతకీ విషయం ఏంటంటే? తమిళనాడులో జల్లికట్టుకు మద్దతు తెలుపుతూ.. ఆందోళనకారులకు వెన్నంటి నిలిచిన టాప్ హీరో అయిన కమల్ హాసన్.. ఆ ఉద్యమం ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ పోలీసులను ఎండగట్టారు. దీన్ని గమనించిన బీజేపీ అధిష్టానం సినీ లెజెండ్‌గా పేరున్న కమల్ హాసన్‌ను బీజేపీలోకి లాగేయాలని పావులు కదిపింది.
 
ఇందులో భాగంగా కమల్ హాసన్‌ను కేంద్ర మంత్రి పొన్. రాధాకృష్ణన్ కలిశారు. మంగళవారం రాత్రి చెన్నైలో కమల్ హాసన్, కేంద్ర మంత్రి పొన్. రాధాకృష్ణన్ ఏకాంతంగా చర్చలు జరిపారు. వీరిద్దరూ జల్లికట్టు, రాజకీయాలపై చర్చించారని సమాచారం. కమల్ హాసన్, కేంద్ర మంత్రి పొన్. రాధాకృష్ణన్ భేటీ అత్యంత రహస్యంగా జరిగిందని తెలుస్తోంది. ఈ భేటీ సందర్భంగా కమల్ హాసన్‌ను పొన్ రాధాకృష్ణన్ బీజేపీలో చేరాలని, రాజకీయాల్లో చురుకుగా పాల్గొని ప్రజాసేవ  చేయాలని పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. కానీ ఈ భేటీపై కమల్ హాసన్ మాత్రం నోరు విప్పలేదు. 
 
రాధాకృష్ణన్‌తో భేటీకి తర్వాతే కమల్ హాసన్ ప్రెస్ మీట్ పెట్టి జల్లికట్టుకు మద్దతుగా మాట్లాడారాని.. ఈ సందర్భంగా తాను రాజకీయాల్లోకి రానని క్లారిటీ ఇచ్చేశారు. కానీ రాజకీయాలు అంటే తనకు ముందు నుంచి పెద్దగా ఆసక్తి లేదని.. అయినా ఏం జరుగుతుందో చూద్దామని కమల్ హాసన్ మెలిక పెట్టారు. దీనిని బట్టి కమల్ హాసన్ త్వరలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్కే బీచ్‌కు నేను వెళ్తున్నా.. ఆగస్టులో వైకాపా ఎంపీలంతా రాజీనామా: జగన్ సంచలన ప్రకటన